HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mallu Swarajyam Passed Away

Mallu Swarajyam: మల్లు స్వరాజ్యం ఇకలేరు!

తెలంగాణ సాయుధ పోరాటంలో తనవంతు పాత్ర పోషించిన యోధురాలు మల్లు స్వరాజ్యం (92) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

  • Author : Balu J Date : 19-03-2022 - 8:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mallu Swrayam
Mallu Swrayam

తెలంగాణ సాయుధ పోరాటంలో తనవంతు పాత్ర పోషించిన యోధురాలు మల్లు స్వరాజ్యం (92) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమె కొన్నిరోజులుగా కేర్ ఆస్పత్రి వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. చికిత్స పొందుతున్న ఆమె శనివారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల తెలంగాణ మేదావులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీ నుండి ఎమ్మెల్యే గానూ పనిచేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబం మొత్తం చివరి వరకు పేద ప్రజల హక్కుల కోసం, ఎర్రజెండా పట్టి ప్రజా పోరాటాలకు ఊపిరి పోశారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా పని చేస్తున్న మల్లు నాగార్జున రెడ్డి ఆమె కుమారుడే కావడం విశేషం. ఆమె కోడలు మల్లు లక్ష్మీ కూడా సీపీఎం పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా పని చేస్తున్నారు.

మల్లు స్వరాజ్యం స్వగ్రామం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం. భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించించారు స్వరాజ్యం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సోదరుడు దివంగత ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978- 83, 1983- 84 వరకు రెండు సార్లు ఆమె ఎమ్మెల్యేగా పని చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mallu Swarajyam
  • passed away
  • telangana

Related News

Kalvakuntla Kavitha

జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

Kalvakuntla Kavitha :  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత మద్దతుదారులు పలు ప్రాంతాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ… భవిష్యత్తులో తాము ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. తమ పార్టీని అధికారికంగా ప్రకటించక ముందే… మున్స

  • Vivek

    Telangana Municipal Polls Results : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భారీ షాక్

  • Kavitha Municipal Election

    తెలంగాణ లో కవిత జోరు మొదలైందా..? మున్సిపల్ ఫలితమే దీనికి నిదర్శనమా ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

  • Revanth Meets Ramohan

    కేంద్రమంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్ భేటీ

Latest News

  • Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

  • Shivaratri 2026 : శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

  • Jana Nayagan : ‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్లేనా ?

  • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

Trending News

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

    • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

    • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd