Malkajgiri Congress Leaders : మైనంపల్లి కి టికెట్ ఇస్తే ఊరుకోం – మల్కాజిగిరి కాంగ్రెస్ క్యాడర్
పార్టీ కోసం శ్రీధర్ మొదటి నుండి కష్టపడుతూ వస్తున్నారని..అలాంటి వ్యక్తిని కాదని మధ్యలో వచ్చిన మైనంపల్లి కి టికెట్ ఇస్తే సపోర్ట్ చేసేదే లేదని సీరియస్ గా చెపుతున్నారు
- Author : Sudheer
Date : 27-09-2023 - 7:24 IST
Published By : Hashtagu Telugu Desk
తన కొడుక్కు బిఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదనే కోపం తో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు (Mynampally Hanumantha Rao) బిఆర్ఎస్ పార్టీ (BRS) కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరి..మల్కాజిగిరి (Malkajgiri ) నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని చూస్తున్నారు. అయితే మైనంపల్లి హన్మంతురావు కు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటున్నారు మల్కాజిగిరి కాంగ్రెస్ క్యాడర్. గతంలో శ్రీధర్‌కే టికెట్ ఇస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని..ఆ హామీని నిలబెట్టుకోవాలని వాపోతున్నారు. పార్టీ కోసం శ్రీధర్ (Sridhar) మొదటి నుండి కష్టపడుతూ వస్తున్నారని..అలాంటి వ్యక్తిని కాదని మధ్యలో వచ్చిన మైనంపల్లి కి టికెట్ ఇస్తే సపోర్ట్ చేసేదే లేదని సీరియస్ గా చెపుతున్నారు.
మైనంపల్లి లాంటి వారు వస్తుంటారు.. పోతుంటారని, పార్టీలో మొదటి నుంచి ఉన్న, పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు (Malkajgiri Congress Leaders). నియోజకవర్గంలో మైనంపల్లిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసింది శ్రీధర్ అని, ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మల్కాజిగిరి కాంగ్రెస్ కేడర్. ఇప్పటికే అనేక పార్టీల్లో చేరిన మైనంపల్లి హనుమంతరావు.. కాంగ్రెస్‌లోచేరి, కాంగ్రెస్ కోసం పని చేస్తారని గ్యారెంటీ ఏంటని ప్రశ్నింస్తున్నారు. సర్వేలన్నీ శ్రీధర్‌కు, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటంతో.. ఆయన వస్తున్నాడని మైనంపల్లిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీసీలు కేవలం కష్టపడటానికేనా? ఓట్లు వేయడానికేనా? పోటీ చేయడానికి పనికిరామా? అని పార్టీ హైకమాండ్‌ను నిలదీస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏంచేస్తుందో..మైనంపల్లి కి టికెట్ ఇస్తుందా..లేక శ్రీధర్ కు ఇస్తుందా అనేది చూడాలి.
Read Also : Heavy Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం