Hyderabad: వ్యభిచారి అనుకుని మహిళపై పోలీసుల చిత్రహింసలు
ఎల్‌బీ నగర్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలలోకి వెళితే..
- By Praveen Aluthuru Published Date - 04:41 PM, Thu - 17 August 23
Hyderabad: ఎల్‌బీ నగర్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. దీంతో ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాలలోకి వెళితే..
గత రాత్రి ఎల్‌బీ నగర్ లో లంబాడా సామజిక వర్గానికి చెందిన మహిళను పెట్రోలింగ్ స్క్వాడ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. తాను చెప్తున్నా వినిపించుకోకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. రాత్రంతా కొట్టినట్టు బాధితురాలు వాపోయారు. మీర్‌పేటలో నివాసం ఉండే వడ్త్యా లక్ష్మి తన కుమార్తె పెళ్లి నిమిత్తం ఆర్థిక సహాయం కోసం ఎల్‌బీ నగర్ లో ఉంటున్న కుటుంబసభ్యుల ఇంటికి వెళ్ళింది. వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డగించి విచిత్రంగా ప్రవర్తించి సదరు మహిళను స్టేషన్ కి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో పని చేసే హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేశారు. కాగా ఈ దారుణంపై డీజీపీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ లంబాడా సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. పోలీసుల ఆరోపణ ఇలా ఉంది. మహిళ వ్యభిచారం చేయిస్తోందని, ఈ కారణంగా తెల్లవారుజామున 2.30 గంటలకు ఆమెను పట్టుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించామని ఎల్‌బీ నగర్ జోన్ డీసీపీ తెలిపారు.
Also Read: US: విమానం గాల్లో ఉండగా బాత్రూంలో చనిపోయిన పైలెట్.. చివరికి?