Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Lal Darwaza Bonalu Is Feast For Eyes

Lal Darwaza Bonalu: కన్నుల పండువగా లాల్‌దర్వాజా బోనాలు

లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలతో భాగ్యనగరంలో సందడి నెలకొంది. తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

  • By Naresh Kumar Published Date - 09:27 PM, Sun - 24 July 22
Lal Darwaza Bonalu: కన్నుల పండువగా లాల్‌దర్వాజా బోనాలు

లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలతో భాగ్యనగరంలో సందడి నెలకొంది. తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల్లో భాగంగా అమ్మవారికి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి  బోనాన్నిసమర్పించారు.తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి బోనాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లాల్‌ దర్వాజ్‌ బోనాల్లో పాల్గొన్న తెలంగాణ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలు తెలంగాణ సంస్కృతి అని, రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అటు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంది. ఈ సందర్భంగా పీవీ సింధును ఆలయ కమిటీ సత్కరించింది. తనకు బోనాల పండుగ అంటే ఇష్టమని సింధు చెప్పుకొచ్చారు. ప్రతీ ఏటా ఆశీస్సులు తీసుకోవాలని ఉంటుందని.. గత సంవత్సరం షెటిల్ పోటీలు ఉండటంతో రాలేకపోయానని వివరించారు. కోవిడ్ కారణంగా ఆలయానికి రాలేదని చెప్పుకొచ్చారు.

బోనమెత్తిన సింధు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. తాను తిరిగి ఈ రోజు లండన్ వెళ్లనున్నట్లు చెప్పారు. బోనాలు చివరి రోజు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags  

  • bonalu
  • hyderabad
  • lal darwaza
  • telangana festival

Related News

Traffic Diverted : శనివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు…వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్న ట్రాఫిక్ పోలీసులు..!!

Traffic Diverted : శనివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు…వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్న ట్రాఫిక్ పోలీసులు..!!

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై శనివారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసు విభాగం శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

  • Girl Sucide : స్కూల్‌కి వెళ్ల‌డం ఇష్టంలేక‌ తొమ్మిదేళ్ల బాలిక‌…?

    Girl Sucide : స్కూల్‌కి వెళ్ల‌డం ఇష్టంలేక‌ తొమ్మిదేళ్ల బాలిక‌…?

  • New Sarojini Devi Eye Hospital : తెలంగాణలో అత్యాధునిక హంగుల‌తో స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రినిర్మాణం

    New Sarojini Devi Eye Hospital : తెలంగాణలో అత్యాధునిక హంగుల‌తో స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రినిర్మాణం

  • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

    Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

  • Talasani Dj Tillu Song :  డీజే టిల్లు పాటకు ….మంత్రి తలసాని అదిరిపోయే స్టెప్పులు..వైరల్ వీడియో..!!

    Talasani Dj Tillu Song : డీజే టిల్లు పాటకు ….మంత్రి తలసాని అదిరిపోయే స్టెప్పులు..వైరల్ వీడియో..!!

Latest News

  • Kalapuram: ప‌వ‌న్ చేతుల మీదుగా ‘కళాపురం’ ట్రైలర్ రిలీజ్!

  • 19Pro 5G: టెక్నో కెమాన్ 19 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు ఇవే!

  • Herbs : వీటిని నిత్యం తీసుకుంటే మీ ఎముకలు బలంగా ఉంటాయి..!!

  • Xiomi Headband: షావోమి హెడ్ బ్యాండ్.. మెదడులో ఆలోచనలు ఇట్టే చెప్పేస్తుందట?

  • Vastu Tips : రాత్రి భోజనం చేసిన తర్వాత గిన్నెలు తోమకుండా పడుకుంటున్నారా…?అయితే మీరు పేదరికంలోకి అడుగుపెట్టినట్లే..!!

Trending

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

    • ఈ విమానం ల్యాండింగ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో!

    • Sweet Shop: 47 ఏళ్లుగా అద్భుతమైన రుచి.. ఆ స్వీట్ చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: