HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktrs Anger Over The Removal Of Government Websites And Social Media Handles

KTR: ఆ వెబ్ సైట్లు, సోషల్ మీడియాను తొలగించటంపై కేటీఆర్ ఆగ్రహం

  • Author : Balu J Date : 02-07-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR
Telangana Women's Commission notice to former minister KTR

KTR: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని కావాలనే ఉద్దేశ పూర్వకంగా తొలగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారికి లేఖ రాశారు. డిసెంబర్ 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతోందన్నారు. కొన్ని ముఖ్యమైన వెబ్ సైట్లను కూడా తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో ఇదంతా మెయింటెనెన్స్ సమస్య అని చెప్పే ప్రయత్నం చేశారన్నారు. కానీ కొన్ని నెలలుగా మరింత సమాచారం కనబడకుండా పోతోన్న సంఘటనలు చూస్తుంటే ఉద్దేశపూర్వంకగానే చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులే ఉన్నారనే సందేహం కూడా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన, అత్యంత ప్రాధాన్యమైన సమాచారాన్ని భవిష్యత్ తరాలకు తెలియకుండా చేసేందుకు చేస్తున్న ఈ హేయమైన చర్యను ఆపాలని సీఎస్ కు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్ కంటెంట్ ను భద్రపర్చాల్సిన అవసరముందన్నారు. ఇలా కావాలనే తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యత భవిష్యత్ తరాలకు తెలియకుండా చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీఎస్ ను కోరారు.

రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన అన్ని ఆధారాలు, సమాచారం, డిజిటల్ కంటెంట్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని సీఎస్ కు గుర్తు చేశారు. కేసీఆర్ గారు సీఎం గా ఉన్న (జూన్ 2014 – డిసెంబర్ 2023) నాటి సమయంలోని వేలాది ఫోటోలు, వీడియోలతో పాటు ఎంతో సమాచారాన్ని తొలగించారన్నారు. తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలియజెప్పే సమచారాన్ని కావాలనే వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cs shanthi kumari
  • hard comments
  • ktr
  • social media

Related News

Anna Konidela

Anna Konidela: మెగా బ్రదర్స్ పై పవన్ భార్య ఎమోషనల్ కామెంట్స్!

Anna Lezhneva ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల (లెజినోవా) సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఆమె, తన పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులతో తనకున్న అనుబంధం గురించి ఆమె చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మెగా కుటుంబంలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా అన్నా తన అనుభవాలన

  • Garikapati Narasimha Rao

    Narasimha Rao Garikapati: గరికపాటి గుడ్డు మాటలు మరోసారి వివాదంలో ..!!

Latest News

  • Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు ఎంబీఏ విద్యార్థి బలి

  • APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్

  • Anil Ravipudi: అనిల్ రావిపూడి మల్టీస్టారర్..

  • Metformin: మెట్‌ఫార్మిన్ గురించి షాకింగ్ నిజాలు

  • H-1B : H-1B ఉద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా పెరిగిన జీతం

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd