HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Tweet On Cm Revanth Reddy

CM Revanth : మీరు కొలువుదీరితే సరిపోతుందా ?..యువతకు కొలువులు అక్కర్లేదా ? – కేటీఆర్

తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన .. మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?

  • Author : Sudheer Date : 09-07-2024 - 3:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ktr
ktr

గత కొద్దీ రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) సర్కార్ ఫై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. డీఎస్సీ వాయిదావేయాలని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులు సమ్మెలు , ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. నిరుద్యోగులు (Unemployes) అలాగే సమ్మెలు చేస్తుంటారు..మనం చూస్తున్నదే కదా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోజు రోజుకు నిరుద్యోగులతో ఆగ్రహపు జ్వాలలు కట్టలు తెచ్చుకుంటుంది. ఇదే తరుణంలో బిఆర్ఎస్ సైతం నిరుద్యోగులకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR).. సీఎం రేవంత్ ఫై ట్విట్టర్ (X) వేదికగా పలుసూటి ప్రశ్నలు సంధించారు.

ముఖ్యమంత్రి గారు…

తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో
మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ?

తొమ్మిది నెలలు కావస్తున్నా..
లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన
మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?

మీరు కొలువుదీరితే సరిపోతుందా ?
యువతకు కొలువులు అక్కర్లేదా ??

గతంలో మీరు..
ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారు.
తిన్నది అరిగేదాకా అరిచే బీరు బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేశారు.
సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని అవహేళన చేశారు.

అధికారంలోకి వచ్చాక…
నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు.
డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారు.
వందల మందిని అన్యాయంగా అరెస్టుచేసి అక్రమ కేసులు పెడుతున్నారు.
కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు.

గుర్తుపెట్టుకోండి..
ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు
మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం
మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారు
నిత్యం పోలీసుల బూట్లచప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నరు

కాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నించడమే వాళ్లు చేసిన నేరమా ?
ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా ?

ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే..
డీఎస్సీ అభ్యర్ధులకు ఇంత ధోకా చేస్తారా..??

ఇప్పటికే మెగా డీఎస్సీ అని..
నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారు

ఇప్పుడు ప్రిపరేషన్ కు కూడా టైమ్ ఇవ్వకుండా..
వారి భవిష్యత్తుతో ఏమిటి ఈ చెలగాటం ?

పరీక్షలు వాయిదా వేయాలని..
డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నా ఎందుకీ మొండివైఖరి ??

న్యాయమైన డిమాండ్లను
ఆడబిడ్డలు అడినంత మాత్రాన
అర్థరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా ?

ఇదేనా మహిళలంటే..
ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం ??

అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు..
అపాయింట్మెంట్ ఆర్దర్లు ఇస్తామన్నారు..

ఇప్పుడు కనీసం
సీఎం అపాయింట్మెంట్ కూడా
నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడంలేదు ??

ప్రచారంలో యువతను మభ్యపెట్టారు..
పీఠమెక్కగానే వారి భవిష్యత్తును బలిపెడతారా ??

నిరాహారదీక్షలు చేసినా స్పందన లేదు
పేగులు తెగే దాకా కొట్లాడినా కనికరం లేదు

పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి..
పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడం
కాంగ్రెస్ సర్కారుకు సిగ్గుచేటు

ఇన్నాళ్లూ అసమర్థ కాంగ్రెస్ ను భుజాలపై మోసిన
సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారు ?
ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయి ?

ఇప్పటికైనా.. డీఎస్సీ అభ్యర్థుల గోస తీర్చాలి..
పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలి

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు
BRS జెండా వారికి అండగా ఉంటుంది..

లేకపోతే
ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు..
నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం..
జై తెలంగాణ

అంటూ కేటీఆర్ పోస్ట్ పెట్టారు. మరి దీనిపై కాంగ్రెస్ సర్కార్ ఏమంటుంది చూడాలి. ఇదిలా ఉంటె ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ‌ను బీఆర్ఎస్‌వీ నాయ‌కులు ద‌హ‌నం చేశారు. రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నిన‌దించారు. ఆందోళ‌న‌కు దిగిన బీఆర్ఎస్‌వీ నాయ‌కుల‌ను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి గారు…

తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో
మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ?

తొమ్మిది నెలలు కావస్తున్నా..
లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన
మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?

మీరు కొలువుదీరితే సరిపోతుందా ?
యువతకు కొలువులు అక్కర్లేదా ??

గతంలో…

— KTR (@KTRBRS) July 9, 2024

Read Also : Chandrababu : ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలిః సీఎం చంద్రబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • DSC
  • ktr
  • Telangana Unemployed

Related News

    Latest News

    • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

    • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

    • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

    • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

    • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd