KTR Thanks AP CM : ఏపీ సీఎం చంద్రబాబుకు KTR థ్యాంక్స్ ..ఎందుకంటే..!!
KTR Thanks AP CM : చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు
- By Sudheer Published Date - 12:01 PM, Tue - 28 January 25

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(AP CM Chandrababu)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) థ్యాంక్స్(Thanks) తెలిపారు. చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, దీనికి ప్రభుత్వాలు చేపట్టిన విధానాలే కారణమని అన్నారు.
Deep Seek AI : అమెరికాకు చైనా ‘డీప్ సీక్’ కలవరం.. డౌన్‌లోడ్లలో నంబర్ 1.. ఎలా ?
ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన కేటీఆర్, తెలంగాణ అభివృద్ధి కోసం గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రగతిశీల విధానాలను ప్రశంసించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేటీఆర్ ఈ ట్వీట్‌లో ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ, చంద్రబాబు మునుపటి శిష్యుడు అయిన రేవంత్ రెడ్డికి ఈ వాస్తవాలను అర్థం చేయాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు తమ పాలనను ప్రశంసించుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తమ ప్రభుత్వ విజయాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ చూపించిన దూరదృష్టి ప్రాముఖ్యతను బీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారు.
CM Chandrababu : సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్ వ్యాఖ్యల అర్థం ఇదా..?
ఇటీవలి కాలంలో చంద్రబాబు పలు సందర్భాల్లో తెలంగాణ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో దేశంలోనే అత్యుత్తమంగా నిలిచాయని పలు వేదికలపై అన్నారు. ఆయన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలకు మరింత ఉత్సాహాన్ని కలిగించాయి. మరోసారి కేటీఆర్ ట్వీట్ ద్వారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడం, రేవంత్ రెడ్డిని ఉద్దేశించిన కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Chief Minister of AP @ncbn Garu has candidly acknowledged on several occasions that Telangana has become the state with the highest per capita income in India because of progressive Govt policies over the last one decade
Thank you CBN Garu. Please educate your erratic erstwhile… pic.twitter.com/XBxyvtAI7x
— KTR (@KTRBRS) January 28, 2025