Revanth Reddy : అతి త్వరలో రేవంత్ తన టీం తో కలిసి బీజేపీలో చేరబోతున్నారు – కేటీఆర్
నేను పుట్టింది బీజేపీలోనే, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని.. ప్రధాని మోదీకి, అమిత్ షా కు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు
- Author : Sudheer
Date : 17-08-2024 - 6:14 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ (BRS vs Congress) మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు , ఛాలెంజ్ లు , విమర్శలు , ఆరోపణలు ఇలా గట్టిగానే నడుస్తున్నాయి. ఇదే తరుణంలో ఒకరు ఫై ఒకరు మీరు బిజెపి లో చేరుతున్నారంటే..మీరు చేరుతున్నారంటూ ఒకరి ఫై ఒకరు ఆరోపణలు సైతం చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ (CM Revanth Reddy)..అతి త్వరలో బిఆర్ఎస్ బిజెపి లో విలీనం కాబోతుందని..ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని కేసీఆర్ కు గవర్నర్ పదవి , కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి , కవిత కు రాజ్యసభ పదవి ఆఫర్ను బిజెపి ఇచ్చిందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ (KTR) రియాక్ట్ అయ్యారు. త్వరలోనే రేవంత్ తన టీమ్ తో కలిసి బీజేపీలో చేరబోతున్నారని.. రేవంత్ తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే. నేను పుట్టింది బీజేపీలోనే, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని.. ప్రధాని మోదీకి, అమిత్ షా కు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పింది వాస్తవమా కాదా అనేది రేవంత్ చెప్పాలి అని , ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అని కేటీఆర్ అన్నారు.
Read Also : Ram Charan : మెల్‌బోర్న్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రామ్ చరణ్