Kodangal Rythu Deeksha : రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు.. చీప్ మినిస్టర్: కొడంగల్ యువతి
Kodangal Rythu Deeksha : “మేము బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ కాదు. కేటీఆర్‌పై అభిమానంతోనే ఇక్కడికి వచ్చాం. మా సమస్యలు తీర్చేది కేటీఆరే. కాంగ్రెస్ పాలన అబద్ధాల మయమే”
- Author : Sudheer
Date : 10-02-2025 - 6:46 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చీఫ్ మినిస్టర్ కాదని, చీప్ మినిస్టర్ అంటూ కొడంగల్‌కు చెందిన ఓ యువతి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొడంగల్‌లో నిర్వహించిన రైతు దీక్షలో ఆమె సీఎం రేవంత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మేము బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ కాదు. కేటీఆర్‌పై అభిమానంతోనే ఇక్కడికి వచ్చాం. మా సమస్యలు తీర్చేది కేటీఆరే. కాంగ్రెస్ పాలన అబద్ధాల మయమే” అంటూ ఆమె ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR ) రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఉప ఎన్నిక జరిగితే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Pawan Kalyan Health : పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి ట్వీట్
రేవంత్‌పై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని, కొడంగల్ ప్రజలు కాంగ్రెస్ పాలన తీరును చూస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలో నరేందర్ రెడ్డి గెలవకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను రైతు నిరసన దీక్షకే వచ్చానా, లేక కొడంగల్‌లో ఉప ఎన్నిక జరిగి రేవంత్ ఓడిపోయిన తర్వాత జరిగే విజయోత్సవ ర్యాలీకి ముందుగానే వచ్చేశానా అన్న సందేహం కలుగుతోంది” అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, గత నాలుగు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీసీ గణన, రైతు బంధు, రైతు కూలీలకు ఆర్థిక సాయం, పేదలకు ఇళ్ల పత్రాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, నిజంగా ప్రజలు సంతోషంగా ఉంటే కొడంగల్ ప్రజలు తిరిగి రేవంత్‌ను గెలిపిస్తారా? అని ఆయన సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్ 💥
దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా..
మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి.. ఇంట్లోనే కూర్చుంటాడు.
50 వేల మెజారిటీ కన్నా ఒక్క ఓటు తక్కువ వచ్చినా.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా.
@KTRBRS pic.twitter.com/mxUfzdx4jM— BRS Party (@BRSparty) February 10, 2025