Legal Notice : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు కేటీఆర్ లీగల్ నోటీసు
Legal Notice : మహేష్ గౌడ్‌కు లీగల్ నోటీసులు జారీ చేసిన కేటీఆర్, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
- By Sudheer Published Date - 10:35 PM, Tue - 17 June 25

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Goud) చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట తప్పుడు ప్రచారం చేయడం దారుణమంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్‌కు లీగల్ నోటీసులు జారీ చేసిన కేటీఆర్, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవ్వగలిగిన హామీలు అమలు చేయలేకపోయిందని, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను మరిపించేందుకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం అనైతికమన్నారు.
Fibernet : ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని పునర్ నియామకం చేసిన ఏపీ ప్రభుత్వం
సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా తాము కోర్టులకు హాజరై సహకరిస్తున్నామని గుర్తుచేశారు. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా అబద్ధ ప్రచారాలతో ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు ఇలా అడ్డగోలుగా చేసిన ఆరోపణలను చూస్తూ ఊరుకోబోవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా పనిచేస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారన్నారు.
Air India Planes: RAT అంటే ఏమిటి? ఇది ఎయిర్ ఇండియా విమానాలను ఎలా తనిఖీ చేస్తుంది?
ఫోన్ ట్యాపింగ్ వంటి లొట్టపీసు కేసులు ప్రజలకు ఉపయోగపడవని, ఈ అంశాన్ని స్థానిక ఎన్నికల్లో తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అబద్ధాల పోటీలో నిమగ్నమయ్యారని, రాష్ట్రాన్ని నడిపించగల సత్తా లేకపోవడం వల్లే ఇలాంటి డ్రామాల ద్వారా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదురు తగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.