Fibernet : ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని పునర్ నియామకం చేసిన ఏపీ ప్రభుత్వం
Fibernet : ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని పునర్నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పురోగమిస్తున్న టెక్నాలజీ సేవల మరింత సమర్థవంతంగా పర్యవేక్షణ కోసం ఈ కొత్త కమిటీ ఏర్పాటు చేశారు
- By Sudheer Published Date - 10:21 PM, Tue - 17 June 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైబర్‌నెట్ కార్పొరేషన్(Fibernet Corporation)లో కీలక సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలో ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని పునర్నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పురోగమిస్తున్న టెక్నాలజీ సేవల మరింత సమర్థవంతంగా పర్యవేక్షణ కోసం ఈ కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది మంది సభ్యులతో ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది.
Nara Lokesh : ఢిల్లీకి నారా లోకేష్ ..పూర్తి షెడ్యూల్ ఇదే
ఈ కమిటీలో ఫైబర్‌నెట్ ఎండీ, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ వంటి కీలక అధికారులను సభ్యులుగా నియమించారు. ముఖ్యంగా ఎస్ఎఫ్ఎల్‌లో డీపీఆర్‌లు (Detailed Project Reports), టెండర్ల పరిశీలన వంటి సాంకేతిక అంశాల్లో ఈ కమిటీ తుది ఆమోదం తెలపనుంది. ఫైబర్‌నెట్ ప్రాజెక్టుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు, వేగవంతమైన అమలు కోసం కమిటీ కీలక బాధ్యతలు నిర్వర్తించనుంది.
Kuppam : శిరీషను ఫోన్ ద్వారా పరామర్శించిన సీఎం చంద్రబాబు
భారత్‌నెట్ రెండో దశ కార్యాచరణను కూడా ఈ టెక్నికల్ కమిటీ పర్యవేక్షించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ముఖ్యపాత్ర పోషించనుంది. టెక్నికల్, వాణిజ్య అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంలో కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. రాష్ట్రంలో డిజిటల్ కనెక్టివిటీని విస్తరించేందుకు ఈ కమిటీ మార్గదర్శకంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.