KTR : 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం : కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఫైర్ అయ్యారు.
- By Pasha Published Date - 08:56 AM, Wed - 22 May 24

KTR : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఫైర్ అయ్యారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జోగిపేటలో విత్తనాల కోసం రైతుల మొక్కులు.. క్యూలైన్ లో పాసుబుక్కులను చూసినం..’’ అని ఆయన తెలిపారు. ‘‘కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు.. అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు..’’ అని కేటీఆర్(KTR) కామెంట్ చేశారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో.. ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అని ఆయన పేర్కొన్నారు. ‘‘6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం అయ్యాయి’’ అని చెప్పారు. గత పదేళ్లుగా కనిపించని కరెంటు కోతలను ఇప్పుడు చూడాల్సి వస్తోందని.. విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడులను కూడా చూస్తున్నామన్నారు.
6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!
6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!
పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం
విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం
కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నం
ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం
సాగునీరు లేక ఎండిన… pic.twitter.com/cqNnFuzvk4— KTR (@KTRBRS) May 22, 2024
We’re now on WhatsApp. Click to Join
కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ ఫార్మర్లు
‘‘కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ ఫార్మర్లు చూస్తున్నం.. ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నం. సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నం. ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నం. చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నం’’ అని కేటీఆర్ తెలిపారు. ‘‘ పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు వెళ్లడాన్ని మేం చూస్తున్నం. రైతుబంధు కోసం నెలలపాటు అన్నదాతల పడిగాపులు చూస్తున్నం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.