HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Questioned To Rahul Gandhi

KTR: రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నల వర్షం.. వీటికి సమాధానం చెప్పాలంటూ సవాల్

తెలంగాణలో ఎన్నికల పోలీంగ్ సమీపిస్తుండటంతో రాజకీయ నేతలు మాటలు కోటలు దాటుతున్నాయి.

  • Author : Balu J Date : 25-11-2023 - 5:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KT Rama Rao
Telangana Minister KTR America Tour

KTR: తెలంగాణలో ఎన్నికల పోలీంగ్ సమీపిస్తుండటంతో రాజకీయ నేతలు మాటలు కోటలు దాటుతున్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు.  ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా..రాహుల్ గాంధీ..? యువతను రెచ్చగొట్టి..చిచ్చుబెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.

ప్రశ్నలు ఇవే

➡️యువతను రెచ్చగొట్టి..చిచ్చుబెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీకి

➡️ దేశంలో గత పదేండ్లలో  తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా వుందా..?

➡️తొమ్మిదిన్నర ఏండ్లలో 2లక్షల 2వేల 735  ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.. ఒక లక్షా 60వేల083 నియామకాలను పూర్తిచేసింది  మా ప్రభుత్వం..ఈ లెక్కతప్పని నిరూపించగలవా..?

➡️ మీరు అధికారం  వెలగబెట్టిన పదేండ్ల కాలంలో( 2004-14 ) తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని?  కేవలం 10వేల 116 మాత్రమే కాదా? ఇదేనా నిరుద్యోగులైన  మీ ప్రేమ..?

➡️మా ప్రభుత్వం ఏడాదికి  సగటున నింపిన సర్కారు కొలువులు 16,850!

➡️ మీ హయాంలో(  2004-14 ) సంవత్సరానికి ఇచ్చింది  కేవలం 1012 జాబులు..!

➡️ ఇదీ మీకూ మాకూ  వున్న తేడా..!  మీరొచ్చి మాకు సుద్దులు చెబితే ఎట్లా..?

➡️జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేసావా..?  ఉద్యోగం చేసావా..? యువత ఆశలు ఆకాంక్షలు  తెలుసా..?  పోటీ పరీక్షలు రాసినవా.? ఇంటర్వ్యూ కు వెళ్లినవా..?  ఉద్యోగార్థుల ఇబ్బందులు ఏమన్నా అర్థమైతయా నీకు..?

➡️95 శాతం ఉద్యోగాలు స్థానిక  బిడ్డలకే దక్కేలా  కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన నిబద్ధత మాది..! మా కొలువులు మాకే దక్కాలన్న ఉద్యమస్ఫూర్తిని నిలబెట్టి నియామకాల నినాదాన్ని నిజం చేసిన వాస్తవాన్ని కాదనగలవా..?

➡️ 1972 లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధలను సమర్థిస్తూ తీర్పునిస్తే..పార్లమెంట్ లో చట్టంచేసి ముల్కీ రూల్స్ ను రద్దుచేసి.. తెలంగాణ స్థానికత హక్కులకు  సమాధికట్టింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా..?

➡️ఆరుసూత్రాలు..610  జీవోలు..గిర్ గ్లానీ నివేదకలు తుంగలో తొక్కి..హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా మార్చేసి ..నాన్ లోకల్  కోటాలు పెట్టి..తెలంగాణ యువతకు  దక్కాల్సిన కొలువులను కొల్లగొట్టి తీరని అన్యాయం చేసిన ద్రోహులు మీరు కాదా..?

➡️మీ పనికిమాలిన పాలనలో ఉపాధిలేక..ఉద్యోగాల్లేక  నిరాశా నిస్పహలతో  తెలంగాణ యువత తుపాకులు చేతబట్టి  అడవిబాటపట్టి  నక్సలైట్లలో చేరింది నిజమా..? కాదా..?

➡️వేలమంది యువకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపి ..ఎన్కౌంటర్ల పేరుతో నిత్యం నెత్తుటేర్లు పారించిన కర్కశ మైన పాలన మీది కాదా..?

➡️మీ కాలంలో ఏపీపీఎస్సీ అక్రమాలకు అడ్డాగా మారి..అంగట్లో బేరంపెట్టి కొలువులను అమ్ముకోలేదా..? ప్రాంతీయ వివక్షతో..ఇంటర్వ్యూల ముసుగులో తెలంగాణ  యువతకు  ఉద్యోగాలు రాకుండా చేసింది నిజం కాదా..?

➡️1952లో నాన్ ముల్కీ గోబ్యాక్..ఇండ్లీ సాంబార్ గో బ్యాక్ అని నినదించిన విద్యార్థులపై తూటాలు పేల్చి..ఏడుగురు తెలంగాణ ముద్దు బిడ్డల్ని  చంపిన  దుర్మార్గులు..దోషులు మీరు కాదా..?

➡️ 1969లో  జై తెలంగాణ అని నినదించిన 369 మంది యువకిశోరాల గుండెల్లో తుపాకిగుండ్లు దించి పొట్టనపెట్టుకున్న నర హంతకులు మీరు కాదా..?

➡️2004లో తెలంగాణకు ఇచ్చిన మాటతప్పి..పదేండ్లు కాలయాపన చేసి వందల మంది యువతీ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన నేరం మీదికాదా..?   సోనియగాంధీ బలిదేవతని మీ పీసీసీ ప్రెసిడెంటే చెప్పింది అబద్ధమా..?

➡️ కర్ణాటకలో 100  రోజుల్లో  రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న మీ ప్రగల్భాలు ఏమయ్యాయి?  6 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెబ్తవా..? వాగ్దానం చేసి యువతను వంచించలేదా…?

➡️మీరు రాజ్యం ఏలుతున్న రాజస్థాన్ లో..చత్తీస్ గఢ్ లో..హిమాచల్ ప్రదేశ్ లో  ఉద్యోగాల భర్తీహామీని మరిచి..నిరుద్యోగులను  నిండా ముంచింది నిజం కాదా..?

➡️మీరు ప్రకటించిన పసలేని జాబ్ కేలండర్ ఒక పచ్చి మోసం కాదా..? ఎన్నికల కోడ్ అమల్లో వుండే 2024 మార్చి ..ఏప్రిల్  …మే నెలల్లో ఉద్యోగ నోటిఫిషన్లు ఎట్లా  సాధ్యం..? యువతను మభ్యపెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే నాటకం తప్ప చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Politics
  • hard comments
  • ktr
  • rahul gandhi

Related News

Ktrslbc

SLBC : ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఉంది. సొరంగం పనులను పర్యవేక్షించడంలో విఫలమవడమే కాకుండా, సహాయక చర్యల్లో జాప్యం చేయడం ద్వారా ప్రభుత్వం కార్మికుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు

    Latest News

    • ఈ ఎన్నికలో నాకు , స్టాలిన్‌కు మధ్య యుద్ధమే : విజయ్

    • హార్దిక్ పాండ్యా ఔట్.. చ‌ప్ప‌ట్లు కొట్టిన ప్రేయ‌సి, వీడియో వైర‌ల్‌!

    • తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు సర్వం సిద్ధం : బోర్డు సెక్రటరీ కీలక సూచనలు ఇవే.. !

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు ఫైర్

    Trending News

      • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

      • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

      • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

      • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd