KTR Legal Notices : కొండాసురేఖ కు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్
Chaitu - Sam Divorce : మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడనే సోయి లేకుండా మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు
- By Sudheer Published Date - 09:52 PM, Wed - 2 October 24

సమంత విడాకులు తీసుకోవడానికి, టాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి తానే కారణమంటూ మంత్రి సురేఖ (Konda Surekha) చేసిన కామెంట్స్ ఫై కేటీఆర్ (KTR) స్పందించారు. తన ఇమేజ్ కు భంగం కలిగించాలనే ఇలా చేశారంటూ ఆమెకు లీగల్ నోటీసులు (Legal Notices) పంపించారు. సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేసిన సురేఖ 24గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
నాగ చైతన్య – సమంత ( Naga Chaitanya – Samantha Divorce ) విడిపోవడానికి కేటీఆర్ కరణ అంటూ సురేఖ కీలక వ్యాఖ్యలు చేసారు. N కన్వెన్షన్ (N Convention) కూల్చకుండా ఉండాలంటే సమంత ను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయడం తో.. నాగార్జున..సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఫోర్స్ చేసాడు..కానీ సమంత ఒప్పుకోలేదు…అలాంటి పని చేయనంటే..చేయనని తేల్చి చెప్పడం తో..కుటుంబంలో గొడవలు జరిగాయి. కేటీఆర్ దగ్గరికి వెళ్లకపోతే మా ఇంట్లో ఉండొద్దని నాగార్జున తెచ్చి చెప్పడంతో..ఆ పని చేయలేక సమంత విడాకులు తీసుకుంది. నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని తేల్చి చెప్పింది. రకుల్ ప్రీతీ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అని పలువురు హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది కేటీఆరే అని సురేఖ తెలిపింది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు చిత్రసీమ తో పాటు ఇటు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కొండా సురేఖ చెప్పిందట్లో ఎంత నిజం ఉంది..? ఎలాంటి ఆధారాలు ఉన్నాయి..? ఓ కన్వెన్షన్ కోసం నాగార్జున ఇంత దిగజారుతారా..? కొడుకు భార్య ను మరో వ్యక్తి దగ్గరికి పంపిస్తాడా..? ఇదేమైనా సినిమానా..? ఇలాంటి వ్యాఖ్యలు కొండా సురేఖ ఎలా చేసింది..? ఓ హోదా లో ఉన్న ఆమె..మరో మహిళా ఫై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి..? హీరోయిన్లు అంటే కేవలం అలాంటి పనులకేనా..? అని అభిమానులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున, సమంత , నాగ చైతన్య ఖండించారు. మీ రాజకీయాల కోసం తమను లాగొద్దని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు గాను కేటీఆర్ సైతం ఘాటుగా స్పందిస్తూ సురేఖ కు లీగల్ నోటీసు పంపించారు. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్‌పై అసత్యాలు మాట్లాడరని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, కేవలం తన గౌరవానికి, ఇమేజ్‌కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారని.. మహిళ అయిఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమన్నారు.
అసలు తనకు సంబంధమే లేని ఫోన్ టాపింగ్, ఇతర అంశాలపైన కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారన్నారు. ఎలాంటి సాక్షాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయని.. ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండ సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడనే సోయి లేకుండా మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఏప్రిల్‌లో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.
కొండ సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదేపదే అవే అబద్ధాలను వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసు వేస్తామని స్పష్టం చేశారు.
Read Also : Konda Surekha : మీ రాజకీయాల కోసం నన్ను వాడుకోకండి – సమంత రియాక్షన్