HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Lambasts Bjp On Statehood Issue And Secularism

KTR: మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది!

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్ బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రశ్నించారని.. ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారా లేదా అనేది తేల్చుకోవాలని కోరారు.

  • Author : Hashtag U Date : 17-02-2022 - 7:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR
KTR

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్ బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రశ్నించారని.. ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారా లేదా అనేది తేల్చుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ గ్రామంలో బుధవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వి.ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మోడీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నిస్తున్న బీజేపీ లాంటి పార్టీ మనకు అవసరమా?

అని ప్ర‌శ్నించారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఇంతకుముందు రైతులకు కేవలం ఆరు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసేవారని, అది కూడా తరచూ కోతలకు గురవుతున్నదని ఆయన అన్నారు. తెలంగాణకు ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసి ఉంటే నిరూపించాలని కేటీఆర్‌ సవాల్ విసిరారు. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తే బీజేపీ నేతలు త‌మ‌పై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమగ్రాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, షకీల్, ఎ.జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జె.సురేందర్, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, జితేష్ వి.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • It minister ktr
  • ktr
  • prime minister modi

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd