HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Hard Comments On Bjp Leaders Press Meet Today

KTR Pressmeet: కేసీఆర్ ది స్టేట్స్ మన్ పాలన, మోడీది సేల్స్ మెన్ పాలన!

తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, జాతీయ పార్టీ బీజేపీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఉద్యోగుల బదిలీల జీవోను సవరించాలంటూ బీజేపీ చీఫ్ బండి దీక్షకు దిగడం, అరెస్ట్ కావడం, నడ్డా ఎంట్రీ ఇవ్వడం లాంటి విషయాలన్నీ

  • By Balu J Published Date - 05:16 PM, Wed - 5 January 22
  • daily-hunt
KTR
KTR

తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, జాతీయ పార్టీ బీజేపీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఉద్యోగుల బదిలీల జీవోను సవరించాలంటూ బీజేపీ చీఫ్ బండి దీక్షకు దిగడం, అరెస్ట్ కావడం, నడ్డా ఎంట్రీ ఇవ్వడం లాంటి విషయాలన్నీ హాట్ టాపిక్ గా మారాయి. బండి అరెస్టును నిరసిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు సార్లు ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన జుగుప్సా కరమైన, హేయమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, నడ్డా అంటే నిన్నటి దాకా ఒక గౌరవం ఉండేది, అసంబద్ధ వ్యాఖ్యలతో నడ్డా స్థాయి బండి సంజయ్ తోసమానంగా మారిపోయారని విమర్శించారు.

బీజేపీ నేతల తీరు చూస్తే బీజేపీ ని బాక్వాస్ జుమ్లా పార్టీ గా పేరు మార్చొచ్చు అని ఎద్దేవా చేశారు. మోడీ ఈ ఏడేండ్లలో చేసిన మంచి పని ఒక్కటి లేదనీ, బీజేపీ కి సీబీఐ, ఈడీ, nia భాగస్వామ్య పక్షాలుగా మారాయని కేటీఆర్ ఆరోపించారు. 2022 కల్లా ఇండియా లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని మోడీ హామీ ఇచ్చారని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని కూడా హామీ ఇచ్చారని, ప్రతి ఇంటికి టాయిలెట్ నల్లా అన్నాడు మోడీ.. కనీసం గుజరాత్ లోనైనా ఇచ్చావా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పంజాబ్ లో రైతుల నిరసన తో పీఎం మోడీ పంజాబ్ లో ఎన్నికల సభ ను రద్దు చేసుకున్నారని, ఇంతటి దౌర్భాగ్యం ఏ పీఎం కు రాలేదని, కేసీఆర్ ది స్టేట్స్ మన్ పాలన, మోడీది సేల్స్ మెన్ పాలన అని ఆరోపించారు. నడ్డా అబద్ధాల అడ్డా కేర్ ఆఫ్ ఎర్రగడ్డ అని సైటర్స్ వేశారు.

అర పైసా ఉపయోగ పడే పని మోడీ దేశానికి ఏమైనా చేశారా? కాళేశ్వరం కేసీఆర్ కు ఎటిఎం అంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిజం ఎటిఎంయే.. ఏటీఎం అంటే అన్నదాతకు తోడుండే మెషిన్ అని వివరణ ఇచ్చారు. దిక్కుమాలిన బీజేపీ కి మా ప్రభుత్వ పథకాలే కాపీ కొట్టడానికి పనికొస్తున్నాయని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా నడ్డా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. నీతి ఆయోగ్ కున్న నీతి నడ్డా కు లేదనీ, ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా.. లక్షలాది మంది రైతుల గోస గుచ్చుకున్న చరిత్ర బీజేపీ కాదా అని ప్రశ్నించారు.

మేము ఉద్యమాల్లో పాల్గొని ప్రజలు ఎన్నుకుంటే గెలిచాం, బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి అత్యంత ఎక్కువ అని మీడియా సంస్థలు మేధావులు ఘోషిస్తున్నారని, దీని మరిచి నడ్డా అవినీతి గురించి మాట్లాడటమా? బండి సంజయ్ తన గుండు తానే పగులగొట్టుకుంటున్నాడు. బండి పోతే బండి వస్తుంది.. గుండు పోతే గుండు వస్తుందా? మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల స్థానికత కోసమే 317 జీఓ ఇచ్చామని, మాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, బీజేపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు బెదిరేవారు ఎవ్వరూ లేరనీ, భయ పడితే తెలంగాణ వచ్చేదా అని, మార్కెట్ లో బీజేపీ కి భయపడే వారు ఎవరైనా ఉండొచ్చు, కానీ మేము కచ్చితంగా బీజేపీ వెంట పడుతూనే ఉంటాం  నిలదీస్తూనే ఉంటాం, దేంట్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో కేటీఆర్ వెంట వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, దాసరి మనోహర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణిలు ఉన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ktr
  • press meet
  • telangana bhavan

Related News

Kcr Nxt Cm

KCR : 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయం..రాసిపెట్టుకోండి – కేటీఆర్ ధీమా

KCR : హైదరాబాద్‌లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు

  • Ktr Hydraa

    Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్

  • Harish Rao Father

    Harish Rao Father Died : హరీష్ రావు తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించిన కేటీఆర్‌

Latest News

  • Mobile Plans Prices: డిసెంబర్ 1 నుంచి మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

  • Foot Soak: ఇలా చేస్తే నొప్పి, అలసట నిమిషాల్లో మాయం!

  • 1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి

  • Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

  • 20 Lakh Jobs : రాష్ట్రంలో నిరుద్యోగులకు ’20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ – మంత్రి నారా లోకేష్

Trending News

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

    • Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

    • Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd