HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Challenge To Cm Revanth Reddy Over Allegations On Formula E Racing

Formula E Racing : దమ్ముంటే చర్చ పెట్టు ..కేటీఆర్ సవాల్

KTR Challenge to CM Revanth : ఫార్ములా ఈ రేస్ ఒప్పందం గురించి అనేక ఆరోపణలు చేస్తున్న మీ ప్రభుత్వం అసలు నిజాలు ప్రజల ముందుంచడానికి సిద్ధంగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు

  • Author : Sudheer Date : 18-12-2024 - 6:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Challenge To Cm Revanth
Ktr Challenge To Cm Revanth

గత కొద్దీ రోజులుగా ఫార్ములా ఈ రేస్(Formula E Racing) అంశంపై రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రేస్ లో అనేక అవకతవకలు జరిగాయని..ఈ అవకతవకల్లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్(KTR Arrest ) చేయబోతున్నారని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ అంశంపై అసెంబ్లీ లో చర్చ పెట్టండి అంటూ కేటీఆర్..సీఎం రేవంత్ కు సవాల్ (KTR Challenge to CM Revanth Reddy) చేసారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం గురించి అనేక ఆరోపణలు చేస్తున్న మీ ప్రభుత్వం అసలు నిజాలు ప్రజల ముందుంచడానికి సిద్ధంగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై బహిరంగ చర్చ శాసనసభలో జరిగితే అందరికీ స్పష్టత వస్తుందని కేటీఆర్ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

కేటీఆర్ లేఖలో.. 2023లో ఫార్ములా ఈ రేస్ విజయవంతంగా నిర్వహించబడిందని, దీని ద్వారా రాష్ట్రానికి రూ. 700 కోట్ల లాభం చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదికలో తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే ఈ రేస్ హైదరాబాద్ నగరానికి మంచి పేరు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా, దుష్ప్రచారం చేస్తూ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. “ఫార్ములా ఈ ఒప్పందం పూర్తిగా పారదర్శకంగా జరిగింది” అని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. గతంలోనూ ఈ అంశంపై తగిన వివరణ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఇంకా ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తోంది అని మండిపడ్డారు. మీరు నిజాయితీగా ఉంటే శాసనసభలో బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ అంశంపై శాసనసభ వేదికగా చర్చ జరిపితే ప్రజల ముందు పూర్తి వివరాలు బయటపడతాయని కేటీఆర్ తెలిపారు. మరి కేటీఆర్ సవాల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుందా..? లేదా అనేది చూడాలి.

I challenge CM Revanth Reddy to hold a discussion in the ongoing Telangana Legislative Assembly session on the Formula E Race (Hyderabad E-Prix)

Why discuss this matter for 1 and half hours in Cabinet Meeting and plant silly media leaks?

Instead of discussing within confines… pic.twitter.com/QE5IRHhrKk

— KTR (@KTRBRS) December 18, 2024

Read Also : Vijay Thalapathy : అమిత్ షా వ్యాఖ్యల పై విజయ్ దళపతి ఆగ్రహం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs vs congress
  • Formula E racing
  • ktr
  • KTR Challenge to CM Revanth

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

    Latest News

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd