Vijay Thalapathy : అమిత్ షా వ్యాఖ్యల పై విజయ్ దళపతి ఆగ్రహం
Vijay Thalapathy : "అంబేడ్కర్ పేరంటే కొందరికి అసహనం ఉన్నా, ఆయన ఈ దేశానికి అందించిన సేవలను మాత్రం ఎవ్వరూ కాదనలేరు. ఈ రోజు స్వాతంత్ర్య స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న ప్రతి భారతీయుడూ అంబేడ్కర్‌ను ఆరాధించాల్సిందే" అని విజయ్ దళపతి స్పష్టం చేశారు.
- By Sudheer Published Date - 06:08 PM, Wed - 18 December 24

అంబేడ్కర్(BR Ambedkar)పై అమిత్ షా(Amith Sha) చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ దళపతి(Tamilaga Vetri Kazhagam President Vijay Thalapathy) తీవ్రంగా స్పందించారు. “అంబేడ్కర్ పేరంటే కొందరికి అసహనం ఉన్నా, ఆయన ఈ దేశానికి అందించిన సేవలను మాత్రం ఎవ్వరూ కాదనలేరు. ఈ రోజు స్వాతంత్ర్య స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న ప్రతి భారతీయుడూ అంబేడ్కర్‌ను ఆరాధించాల్సిందే” అని విజయ్ దళపతి స్పష్టం చేశారు. అంబేడ్కర్ పేరు మాత్రమే కాకుండా, ఆయన చేసిన ప్రతి పని దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. అంబేడ్కర్ పేరు పలకడానికి గుండె, పెదవులు కూడా గర్వంతో నిండిపోతాయి. అలాంటి మహనీయుడిపై చేసే ఏవైనా వ్యాఖ్యలు అంగీకారమైనవి కావు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం” అని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు.
తమిళనాడులో విజయ్ దళపతి నాయకత్వంలో వెట్రి కళగం ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతోంది. ఆయన అంబేడ్కర్ పట్ల చూపిస్తున్న గౌరవం, సామాజిక న్యాయం పట్ల అంకితభావం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల హృదయాలను ఆకర్షిస్తోంది. ఈ సందర్భంలో ఆయన చేసిన ఈ ట్వీట్ అమిత్ షా వ్యాఖ్యలపై వ్యతిరేకతను మరింత పెంచింది. విజయ్ దళపతి వ్యాఖ్యలకు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. అంబేడ్కర్ పేరు అనగానే భారతీయులకు గర్వం కలుగుతుందని, అలాంటి వ్యక్తిని అనాగరిక వ్యాఖ్యలతో అవమానించడం తగదని వారు అభిప్రాయపడ్డారు. మొత్తానికి అమిత్ షా వ్యాఖ్యల వివాదం తమిళనాడులోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది.
ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)సైతం ప్రధాని మోడీకి డెడ్‌లైన్ విధించారు. అంబేడ్కర్(BR Ambedkar)పై కేంద్ర మంత్రి అమిత్ షా (Amith Sha) చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని ఖర్గే డిమాండ్ చేశారు. దీనికి గడువుగా అర్ధరాత్రి సమయం ఇచ్చారు. అంబేడ్కర్ పట్ల ప్రధాని మోడీకి గౌరవం ఉండే వెంటనే ఇలా చేయాలనీ పేర్కొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు అంబేడ్కర్ సాధించిన విజయాలు, సమాజానికి అందించిన సేవలను తక్కువ చేసి చూపడమేనని విపక్షాలు మండిపడుతున్నాయి.
Read Also : Amith Sha Comments : ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డెడ్ లైన్