Bandi Sanjay : కేటీఆర్, రేవంత్ ఏకమై మళ్లీ కుట్రలు: బండి సంజయ్
హైదరాబాద్‌లో సమావేశానికి కూడా ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇద్దరూ కలిసే మజ్లిస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారు.
- By Latha Suma Published Date - 03:59 PM, Tue - 8 April 25

Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్, రేవంత్ రెడ్డి పై మరోసారి విరుచుకుపడ్డారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతోంది సీఎం రేవంత్‌రెడ్డేనని బండి సంజయ్ విమర్శించారు. ఈ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. చెన్నైలో అఖిలపక్ష భేటీకి ఇద్దరూ కలిసి వెళ్లారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సమావేశానికి కూడా ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇద్దరూ కలిసే మజ్లిస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్‌లో త్వరలో జరగబోయే సమావేశానికీ ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇద్దరూ కలిసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎంపీలతో ఓటు వేయించారు. హెచ్‌సీయూ భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా? భూదందా, అవినీతిపరులపై ఉక్కుపాదం మోపే మోడీ సర్కార్ కేంద్రంలో ఉంది అని బండి సంజయ్ పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్‌ను కాపాడేందుకే కేటీఆర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిని బరిలోకి దించలేదు. తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ బుద్ధి మారలేదు. కేటీఆర్, రేవంత్ ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెరవెనుక కలిసి పని చేస్తున్నాయని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also: Pawan Kalyan : కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం : పవన్‌కల్యాణ్