Jagan : ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం వేసింది – కేటీఆర్
ఏపీలో జగన్ ఓడిపోతారని అస్సలు ఊహించలేదని , జగన్ ఓటమి ఇప్పటికి ఆశ్చర్యం కలుగుతుందన్నారు
- By Sudheer Published Date - 04:42 PM, Tue - 9 July 24

ఏపీలో జగన్ (Jagan) ఓడిపోవడం (Loss) ఆశ్చర్యం వేసిందన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR). ఢిల్లీ లో ఈరోజు హరీష్ రావు తో కలిసి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి ఢిల్లీ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు లో బెయిల్ కోసం ఎంతగానో ట్రై చేస్తున్నప్పటికీ..కోర్ట్ మాత్రం బెయిల్ ఇవ్వడం లేదు. ఇక కుటుంబ సభ్యులు , పార్టీ నేతలు ప్రతి వారం ఆమెతో ములాఖత్ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ , హరీష్ రావు లు గత నాల్గు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. కవితతో మాట్లాడుతూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈరోజు ఢిల్లీ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు , కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు తదితర విషయాలపై స్పందించారు. తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ని మరచిపోలేదని..ఎన్నికల్లో ఓటమికి తమదే తప్పు అన్నారు. ప్రజలను నిత్యం కలవకపోవడమే మేము చేసిన తప్పు అన్నారు. అలాగే కాంగ్రెస్ ఉచిత హామీలకు ప్రజలు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచామని గుర్తు చేసిన కేటీఆర్…తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు. TRS ను BRS గా మార్చడం వల్ల ఓడిపోయామని చాలా మంది అంటున్నారని.. కానీ దానికి ఆధారం లేదని అన్నారు. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా కాంగ్రెస్ఎం బిజెపి సృష్టించారని కేటీఆర్ ఆరోపించారు.
అలాగే ఏపీ రాజకీయాల ఫై కూడా కేటీఆర్ స్పందించారు. ఏపీలో జగన్ ఓడిపోతారని అస్సలు ఊహించలేదని , జగన్ ఓటమి ఇప్పటికి ఆశ్చర్యం కలుగుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఆ లెక్కలు వేరేలా ఉండేవని అన్నారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇక వైస్ షర్మిల ను కాంగ్రెస్ ఒక వస్తువులా వాడుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also : Trains Cancelled : పలు రైళ్లు రద్దు.. ఇంకొన్ని రైళ్లు దారిమళ్లింపు