Komatireddy Rajagopal reddy: మీ సీఎం మనవడు తినే భోజనమే…విద్యార్థులకు పెడుతున్నారా..?
ఓయూ హాస్టల్లో విద్యార్థులకు చికెన్ కర్రీలో గాజు పెంకులు వచ్చిన ఘటనపై తీవ్రంగా స్పందించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
- By hashtagu Published Date - 07:41 PM, Mon - 12 September 22

ఓయూ హాస్టల్లో విద్యార్థులకు చికెన్ కర్రీలో గాజు పెంకులు వచ్చిన ఘటనపై తీవ్రంగా స్పందించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఓయూలో ఆందోళనకు దిగిన విద్యార్థుల వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డిని ఉద్దేశిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నంలో గాజులు పెంకులు వచ్చాయన్న రాజగోపాల్ రెడ్డి…వీటిని ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇవి కూడా సిల్లీ రీజన్సే అవుతాయాంటూ ప్రశ్నించారు. మీ సీఎం మనవడు తినే భోజనమే విద్యార్థులకు పెడుతున్నారంటూ సబితా ఇంద్రారెడ్డిని నిలదీశారు.
తెలంగాణ CMOను, మంత్రి సబితాఇంద్రారెడ్డికి ట్యాగ్ చేశారు. ఇక ఈ ఘటనపై విద్యార్థులు మాట్లాడుతూ…గాజు పెంకులు ఉన్న భోజనం తిన్నామని తమలో ఎవరికి ఏమైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అన్నం గడ్డలుగా, గాజు పెంకులు వచ్చిన భోజనం !
ఏం అమ్మ సబితమ్మ @SabithaindraTRS ఇవి కూడా సిల్లీ రీజన్స్ ఏ ఐతయా ?
మీ సీఎం మనవడు తినే భోజనమే ఈ పిల్లలకు కూడా పెడుతున్నారా ? @TelanganaCMO pic.twitter.com/dUBHuVzR87
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) September 12, 2022