Munugode : రాజగోపాల్ కాదు..మునుగోడు అభ్యర్థిని నేనే అంటున్న చలమల కృష్ణారెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినా.. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేనే అంటూ పేర్కొన్నారు
- By Sudheer Published Date - 04:52 PM, Thu - 26 October 23

కాంగ్రెస్ పార్టీ (Congress Party) లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లిన వారంతా మళ్లీ సొంతగూటికే చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..తాజాగా మాజీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) సైతం తిరిగి సొంత గూటికే చేరుతున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని టీపీసీసీ అధ్యక్షా పదవి ఇవ్వడం తో కాంగ్రెస్ ఫై అలిగి..తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి బిజెపి (BJP) లో చేరిన రాజగోపాల్..ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆ తర్వాత కూడా బిజెపి తో కలిసి ఉన్న..తాజాగా ఇప్పుడు రాష్ట్రం లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ లో ఉంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావించి..తిరిగి అదే పార్టీ లో చేరబోతున్నారు. అయితే రాజగోపాల్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు, పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి ( Chelamalla Krishna Reddy) ప్రెస్ మీట్ నిర్వహించి మునుగోడు (Munugode Assembly constituency) కాంగ్రెస్ అభ్యర్థిని నేనే అంటూ ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినా.. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేనే అంటూ పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావడం మంచి పరిణామం.. సీపీఎం, సీపీఐ మద్దతుతో భారీ మెజార్టీతో మునుగోడులో నేను గెలవబోతున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకుడు.. రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని.. మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు చివరి క్షణంలో టికెట్ చేజారింది.. అధిష్టానం సాధారణ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు.. ఆ హామీని నిలబెట్టుకోవాలి అని ఆయన కోరారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దు టికెట్ నాదే, భారీ విజయం నాదే అంటూ చలమల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేసారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేయొద్దని కోరినట్లు చలమల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన ఈసారి మునుగోడు నియోజకవర్గం వదిలిపెట్టి రాష్ట్రంలో మరోచోట నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Also : Kasani Gnaneshwar: టీటీడీపీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్ పార్టీలోకి కాసాని జ్ఞానేశ్వర్?