HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kodandaram On Power Plant Issue

Telangana Power : కేసీఆర్ తొందరపాటు వల్ల రూ.81వేల కోట్ల అప్పు – కోదండరాం హాట్ కామెంట్స్

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల రూ.81 కోట్ల అప్పు అయ్యిందన్నారు ప్రొ. కోదండరాం

  • Author : Sudheer Date : 18-06-2024 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kondadaram Power Issues
Kondadaram Power Issues

గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల రూ.81 కోట్ల అప్పు అయ్యిందన్నారు ప్రొ. కోదండరాం (Kodandaram). యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు ఒప్పందం అంశాలల్లోని అవకతవకలపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్‌ నరసింహా రెడ్డిని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కొదండరామ్ కలిశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్‌కు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా, ఛత్తీస్‌గఢ్‌కు భారీగా సొమ్ములు చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించాయి. 2017 చివర్లో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా మొదలైంది. పీపీఏలో ప్రస్తావించినట్టుగా 1000 మెగావాట్లు ఎన్నడూ పూర్తి కాలేదు. బకాయిల చెల్లింపుల వివాదంపై రెండేళ్ల కిందట నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒప్పందం ప్రకారం 2017-2022 వరకు పూర్తి స్థాయిలో కరెంటు రాకపోవడం వల్ల ఓపెన్ మార్కెట్‌లో రెండు వేల కోట్ల పైచిలుకు చెల్లించి విద్యుత్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు అందులో వివరించాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా కొదండరామ్ మీడియాతో మాట్లాడుతూ..విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూ. 81 వేల కోట్లు అప్పులపాలు చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో చాలా సమస్యలు ఉన్నాయని, సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘించిందన్నారు. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలకు చాలా ఖర్చు అవుతోందన్నారు. కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో కొద్ది మందికి లాభంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కాంట్రాక్టర్లకు లాభం జరిగిందని, కానీ ప్రజలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. అక్కరకు రాని టెక్నాలజీని తెలంగాణకు రుద్దీ.. తెలంగాణ ప్రజల నెత్తిన టెక్నాలజీ ఉపయోగించారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కిందన్నారు.

Read Also : Jagan : రేపు పులివెందులకు వైస్ జగన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • kodandaram
  • power plant issue
  • telangana

Related News

Jaggareddy

TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ను టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి క‌లిశారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచిన‌ట్లు జ‌గ్గారెడ్డి తెలిపారు. పార్టీకి రాబోయే ఆరు నెలల నుంచి ఏడాది కాలం కీలకమని.. ఎన్నికల సంవత్

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd