KK To Quit BRS : బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కేకే, గద్వాల విజయలక్ష్మీ
శనివారం కాంగ్రెస్లో చేరుతున్నట్లు కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మీ ప్రకటించారు
- By Sudheer Published Date - 09:16 PM, Thu - 28 March 24
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల తరుణంలో బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి మొదలు..నేటి వరకు కూడా షాకులు తప్పడం లేదు. వరుస పెట్టి నేతలు పార్టీ కి రాజీనామా చేస్తుండడం..మరోపక్క కూతురు లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉండడం..మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కొడుకు కేటీఆర్ ఫై ఆరోపణలు రావడం ఇలా వరుసగా ఎదురుదెబ్బలు ఎదురవుతుండడం తో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఏంచేయాలో కూడా తెలియడం లేదు. పదేళ్ల పాటు తనతో పాటు ప్రయాణం చేసినవారే కాక తెలంగాణ ఉద్యమంలో కొనసాగిన వారు సైతం కేసీఆర్ కు బై బై చెపుతుండడం తో బిఆర్ఎస్ శ్రేణులు తట్టుకోవడం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే ఎంతో మంది బిఆర్ఎస్ వీడి బిజెపి , కాంగ్రెస్ పార్టీలలో చేరగా..బీఆర్ఎస్లో కీలక పదవులు అనుభవించిన కేశవరావు, ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. కేసీఆర్ కు వెన్నంటే ఉన్న కేశవరావు (K Kesava Rao) కూడా పార్టీ మారడాన్ని బిఆర్ఎస్ నేతలు , శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
శనివారం కాంగ్రెస్లో చేరుతున్నట్లు కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మీ (Hyderabad Mayor Gadwal Vijayalakshmi) ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని ఆమె తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళ్తున్నట్లు విజయలక్ష్మీ వెల్లడించారు. తనతో పాటు కొంత మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. అలాగే కేశవరావు మాట్లాడుతూ..పార్టీకి సంబంధించిన అంశాలపై కేసీఆర్తో చర్చించినట్లు … పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. కవిత అరెస్ట్ గురించి కూడా చర్చించామన్నారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని.. అలాగే తనకు కూడా కేసీఆర్పై గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా తనకు బాగా సహకరించారన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్లో ఉన్నానని.. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
Read Also : Suriya: కంగువ తర్వాత ఆ డైరెక్టర్ తో పనిచేయబోతున్న సూర్య.. దర్శకుడు ఎవరో తెలుసా?
Related News
GHMC Mayor: కాంగ్రెస్లోకి GHMC మేయర్.. స్పష్టం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్..!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్లో బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) గద్వాల విజయలక్ష్మి త్వరలోనే కాంగ్రెస్లోకి వెళ్తారని తెలుస్తోంది.