Kishan Reddy : రేవంత్ ‘గాడిద గుడ్డు’ ఫై కిషన్ రెడ్డి ఆగ్రహం
గడిచిన పదేళ్లుగా తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఢిల్లీ దర్బారుకు పన్నులు, జీఎస్టీ కట్టి అలిసి పోయారని, కానీ ఢిల్లీ దర్బారు తిరిగి తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని ..మనకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ
- Author : Sudheer
Date : 04-05-2024 - 10:29 IST
Published By : Hashtagu Telugu Desk
లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పదే పదే ..కేంద్రం తెలంగాణ ‘గాడిద గుడ్డు’ (Donkey’s Egg) ఇచ్చిందంటూ చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేసారు. గడిచిన పదేళ్లుగా తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఢిల్లీ దర్బారుకు పన్నులు, జీఎస్టీ కట్టి అలిసి పోయారని, కానీ ఢిల్లీ దర్బారు తిరిగి తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని ..మనకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి.. లోక్‌సభ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇద్దామంటూ సీఎం రేవంత్ పదే పదే అంటున్నారు. ఈరోజు కొత్తగూడెం సభలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
పదేళ్లపాటు తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీనేనన్న సీఎం.. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బిజెపి ప్రణాళికలు వేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శే చెప్పారన్నారు. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, అర్వింద్ చెప్పాలని అన్నారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్‌రెడ్డి కోరారు. పదేళ్లుగా మోదీ, బీజేపీ ఈ రాష్ట్రానికి గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చిందని ఆయన విమర్శించారు.
సీఎం వ్యాఖ్యలపై బిజెపి అగ్ర నేత , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రేవంత్ కు బహిరంగ లేఖ రాసారు. పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత ఇచ్చారు? పదేళ్ల ఎన్డీయే హయాంలో ఎంత ఇచ్చారు? తేల్చుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? 2014 నుంచి 2024 వరకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎన్ని? చర్చకు ఆహ్వానిస్తూ ఆయన లేఖ రాశారు.
Read Also : Panipuri Water : పానీపూరి వాటర్ టేస్టీగా ఉన్నాయని జుర్రేస్తున్నారా ? మీకో షాకింగ్ న్యూస్..