Telangana MPs Meeting : తెలంగాణ ఎంపీల సమావేశానికి కిషన్ రెడ్డి డుమ్మా
Telangana MPs Meeting : తనకు ఆహ్వానపత్రం ఆలస్యంగా అందిందని, ఇప్పటికే నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాలు, అధికారిక సమావేశాల కారణంగా హాజరుకాలేనని కిషన్ రెడ్డి భట్టి విక్రమార్కకు లేఖ ద్వారా తెలిపారు
- By Sudheer Published Date - 11:31 AM, Sat - 8 March 25

తెలంగాణ ఎంపీల సమావేశానికి (Telangana MPs Meeting) హాజరుకాలేకపోతున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులు, కేంద్రానికి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించే లక్ష్యంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయితే తనకు ఆహ్వానపత్రం ఆలస్యంగా అందిందని, ఇప్పటికే నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాలు, అధికారిక సమావేశాల కారణంగా హాజరుకాలేనని కిషన్ రెడ్డి భట్టి విక్రమార్కకు లేఖ ద్వారా తెలిపారు.
US Visa : అమెరికా వీసా ట్రై చేసేవారికి బ్యాడ్ న్యూస్
తన లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇస్తూ.. తెలంగాణ ఎంపీల సమావేశానికి ఆహ్వానం అందిందని ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సమాచారం ఆలస్యంగా అందినందున పార్టీ అంతర్గతంగా చర్చించేందుకు వీలు పడలేదని, అందువల్ల ఈ సమావేశానికి హాజరుకాలేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు ముందుగానే తెలియజేస్తే వాటిని సముచితంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని తన లేఖలో పేర్కొన్నారు.
Women’s Day: స్త్రీల సలహాలు ఖచ్చితంగా పాటించాలి – సర్వే చెపుతున్న మాట
కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని తన లేఖలో స్పష్టంగా తెలియజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అంకితభావంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తెలంగాణకు మరింత మద్దతు అందిస్తూ కేంద్రం చేయూతనిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి ఈ సమావేశానికి హాజరుకాలేనని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో ముఖ్యమైన రాష్ట్ర స్థాయి సమావేశానికి బీజేపీ మంత్రి గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.