HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Khammam People Fire On Minister Ponguleti Srinivas

Khammam : శీనన్న..వర్షాలు కనిపించడం లేదా..?

చుట్టుపక్కల నుంచి భారీగా వరదనీరు పాలేరుకు చేరుతోంది. దీంతో 23 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను 26.అడుగులకు చేరుకుంది

  • Author : Sudheer Date : 01-09-2024 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kmm Ponguleti
Kmm Ponguleti

అల్ప పీడన ప్రభావం తో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు , వంకలు ఉప్పంగిప్రవహిస్తున్నాయి. దీంతో అనేక చెరువులకు గండి పడి వరద ప్రవాహం ఇళ్లలోకి చేరాయి. అంతే కాదు అనేక చోట రహదారులు , రైల్వే ట్రాక్ లు తెగిపోయి రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది.

ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే..

జిల్లాలో రెండ్రోజులుగా భారీ వర్షంకురుస్తోంది. శుక్రవారం మొదలైన వర్షం ఆదివారం వరకు అలాగే కొనసాగుతుండడం తో జనజీవనం స్తంభించింది. వరద భారీగా చేరడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండాను ఆకేరు వరద ప్రవాహం చుట్టుముట్టింది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో గ్రామస్తులు డాబాల పైకి ఎక్కి తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఖమ్మం నగరంతోపాటు శివారు ప్రాంతాలైన చింతకాని, రఘునాపథపాలెం, ఖమ్మం రూరల్‌ తదితర మండలాల్లోనూ భారీ వర్షం కురుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ ప్రమాదకరపు అంచుల్లో అలుగు పోస్తుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి..చుట్టుపక్కల నుంచి భారీగా వరదనీరు పాలేరుకు చేరుతోంది. దీంతో 23 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను 26.అడుగులకు చేరుకుంది. దీంతో జలాశయం నిండుకుండగా మారింది. జిల్లా సరిహద్దు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహంతో పాలేరు ఏటినుంచి వరదనీరు చేరుతుంది. దీంతో రిజర్వాయర్ కట్ట కోతకు గురవుతుంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ పొంగి పక్కనే అన్న నాయకన్ గూడెం గ్రామంలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి నీరు చేరడం తో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నామని..ఎవరైనా సాయం చేస్తారో అని ఎదురుచూస్తున్నామని..గ్రామం మునిగిపోతున్నమంత్రి పట్టించుకోవడం లేదని , ఇంత వర్షం పడుతున్న మంత్రి శ్రీను కు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న పాలేరు పొంగడం ఇదే మొదటి సారి..ఇది అధికారుల తప్పిదం వల్లనే ఇలా జరిగిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాలేరు గ్రామంలోని వడ్డెర కాలనీ సుమారు 6 నుండి ఏడు అడుగులకు వరద నీరు చేరుకోవడంతో ఇండ్లు నీటమటమయ్యాయి. నీటిలో చిక్కుకున్న 23కుటుంబాలను గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు,ప్రైవేట్ ఫంక్షన్ హాలుకు,సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్నివేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. పాలేరు ఉప్పొంగి ప్రవహిస్తుండడం తో ఖమ్మం-సూర్యాపేట జాతీయ(పాత )రహదారిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. సుమారు రహదారి పై 3 అడుగు లోతు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read Also : Gabbar Singh Rerelease : హరీష్ శంకర్ మల్లెపూలు.. బండ్ల గణేష్ ఏం చెప్పారంటే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • khammam
  • paleru river
  • Ponguleti srinivas

Related News

Ktr Velugumatla Demolition

Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

  • Kmm

    ఖమ్మంలో దారుణం.. బీమా డబ్బు లు వస్తాయని కట్టుకున్న భర్తనే చంపేసిన భార్య

Latest News

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd