Danam Nagender : బిఆర్ఎస్ లో మిగిలేది నలుగురే..దానం కీలక వ్యాఖ్యలు
త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తెలిపి షాక్ ఇచ్చారు
- By Sudheer Published Date - 01:51 PM, Fri - 12 July 24

తెలంగాణ బిఆర్ఎస్ (BRS) పార్టీ పరిస్థితి చూస్తే అయ్యో అనకుండా ఉండలేరు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ (KCR) కు వరుస షాకులు తగులుతున్నాయి. రాష్ట్ర ప్రజలే కాదు సొంత పార్టీ నేతలు సైతం కేసీఆర్ ను నిద్ర పోకుండా చేస్తున్నారు. ప్రజల్లో పార్టీ ఫై నమ్మకం కలిగేలా చేయాలనీ కేసీఆర్ భావిస్తుంటే..సొంత పార్టీ నేతలు ఒకరి తర్వాతఒకరు కాంగ్రెస్ లో చేరుతుండడం పార్టీ ఫై నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. పదేళ్ల అభివృద్ధి , అందించిన సంక్షేమ పథకాలు ఇలా అన్ని మరోసారి గెలిపిస్తాయని భావించిన కేసీఆర్ కు ప్రజలు..మాత్రం అవేమి వద్దు మార్పు కావాలని కోరి కాంగ్రెస్ ను గెలిపించారు. 119 స్థానాల్లో పోటీ చేసిన బిఆర్ఎస్ కు కేవలం 39 స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆ 39 ని కూడా ఖాళీ చేస్తామని , లాస్ట్ మిగిలేది కేసీఆర్ కుటుంబ సభ్యులే అని కాంగ్రెస్ అంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
గత కొద్దీ రోజులుగా గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ (Congress) బాట పడుతున్నారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..మరికొంతమంది కూడా ఇదే ఆలోచనలో ఉన్నారని సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender ) కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తెలిపి షాక్ ఇచ్చారు. శుక్రవారం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హిమాయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను దానం నాగేందర్ పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపాడని, కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్‌మెంట్ కూడా దొరికేది కాదని, ఒకవేల దొరికినా.. గంటల తరబడి వెయిట్ చేయించేవారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆలా ఉండదని, స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో అందరికీ విలువ ఉంటుందని, గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఉండేదని, బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అంటే అసలు ఫండే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని, వాటి వివరాలు త్వరలో బయట పెడతానని అన్నారు.
Khairatabad MLA Danam Nagender Predicts BRS Split
Khairatabad MLA Danam Nagender has predicted an imminent split within the Bharat Rashtra Samithi (BRS) legislature party, asserting that the majority of its members are poised to join the Congress party.
Nagender declared,… pic.twitter.com/yaRhLWuKsO
— Sudhakar Udumula (@sudhakarudumula) July 12, 2024
Read Also : Indian 3 : భారతీయుడు 3 ట్రైలర్ చూసారా.. పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో..