Food Poisoning : ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటనలో కీలక విషయాలు బయటకు
Food Poisoning : మృతుడు కరణ్ చనిపోయినదానికి ఫుడ్ పాయిజన్ కారణం కాదని, అతనికి ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలే కారణమని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిత వెల్లడించారు
- By Sudheer Published Date - 09:10 AM, Sat - 7 June 25

ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్ కేసు (Erragadda Hospital Food Poisoning) సంచలనం రేపింది. జూన్ 1న ఆసుపత్రిలో 92 మంది మానసిక రోగులకు వాంతులు, విరేచనాలు రావడంతో చికిత్స కోసం కొందరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. వీరిలో కిరణ్ (Kiran) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా? లేక మరో కారణమా? అనే అనుమానాలు వెల్లువెత్తాయి. తొలుత పాయసం వల్లే పాయిజన్ (Food Poisoning) అయిందని భావించినా, అదే పాయసం ఇతర స్టాఫ్ కూడా తిన్నా వారికి ఎలాంటి సమస్యలు రాలేదని వైద్యులు వెల్లడించారు.
Drinking Alcohol: మద్యం సేవించే వారికే ఈ సమస్య ఉందా? అయితే ఇది తెలుసుకోండి!
వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానసిక రోగులకు ప్రత్యేక భోజనం అందించబడింది. పాయసం, సొరకాయ రోటిపచ్చడి, పప్పు, సాంబార్ వంటివి వడ్డించారు. వీటిలో ఏదో ఒకదానిలో కంటామినేషన్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తాగునీటి ద్వారా ఇన్ఫెక్షన్ జరగలేదని తేలింది, ఎందుకంటే అదే నీరు వందలాది మంది ఇతరులకు కూడా సరఫరా అయినా ఎవరూ అనారోగ్యానికి గురయ్యారనేది రికార్డుల ద్వారా నిరూపితమైంది. స్టూల్, ఫుడ్ నమూనాలు ల్యాబ్‌కి పంపినట్లు మరియు నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు.
New Scheme : ఏపీలో మరో కొత్త పథకం..ఎవరికోసం అంటే !!
ఈ ఘటన అనంతరం ఆసుపత్రి పాలనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫుడ్ సరఫరాదారుని మార్చి కొత్త కాంట్రాక్టర్ నియమించగా, రోగులకు మినరల్ వాటర్ అందిస్తున్నారు. ఆసుపత్రి ఆర్‌ఎంఓ పద్మను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించి డాక్టర్ శంకర్‌ను బాధ్యతలోకి తీసుకున్నారు. కాగా, మృతుడు కరణ్ చనిపోయినదానికి ఫుడ్ పాయిజన్ కారణం కాదని, అతనికి ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలే కారణమని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిత వెల్లడించారు. పూర్తి నివేదికలు వచ్చాకే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. అంతవరకు, బాధ్యత ఎవరిది అన్న దానిపై స్పష్టత రావడం లేదు.