AP Govt: ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
AP Govt: ఆమ్రపాలి (Amrapali) - ఆంధ్రప్రదేశ్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు, అలాగే టూరిజం అథారిటీ CEOగా అదనపు బాధ్యతలు పొందారు
- By Sudheer Published Date - 09:20 PM, Sun - 27 October 24

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆమ్రపాలి (Amrapali) – ఆంధ్రప్రదేశ్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు, అలాగే టూరిజం అథారిటీ CEOగా అదనపు బాధ్యతలు పొందారు. వాణి ప్రసాద్ – కార్మిక శాఖ, వాకాణి కరుణ – వైద్యారోగ్య శాఖ కమిషనర్, వాణిమోహన్ – జీఎడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు పొందారు. ఈ నియామకాలు డీఓపీటీ (DOPT) ఆదేశాల ప్రకారం జరిగాయని పేర్కొన్నారు. అంతకుముందు ఏపీకి వెళ్లేందుకు ఈ నలుగురు అధికారులూ నిరాకరించారు. తెలంగాణలోనే కొనసాగేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. చివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఏపీలో రిపోర్టు చేశారు.
Read Also : Janwada Farm House : ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది – హరీష్ రావు