HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Who Knew The Outcome Of Jubilee Hills Did Not Campaign

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఫలితం ఏంటో తెలిసే KCR ప్రచారం చేయలేదు – సీఎం రేవంత్

Jublihils Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న వేళ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం మరింత రగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు

  • Author : Sudheer Date : 09-11-2025 - 4:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
Congress

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న వేళ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం మరింత రగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రచారం లో రేవంత్‌పై విమర్శిస్తూ.. “సీఎం గారూ, కాలికి బలపం కట్టుకుని జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతున్నారు” అని వ్యాఖ్యానించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ .. “పార్టీ అభ్యర్థి గెలిపించుకోవడం నా బాధ్యత. అందుకే ప్రజల మధ్యకి వచ్చి ప్రచారం చేస్తున్నాను. ముఖ్యమంత్రిగా కాకుండా, కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజల మనసులు గెలుచుకునేందుకు ఇక్కడ ఉన్నాను” అన్నారు. ఆయన మాట్లాడుతూ, “ఇది నా కర్తవ్యం ఎవరినైనా విమర్శించడానికి కాదు, ప్రజాసేవ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను” అని స్పష్టం చేశారు.

Isro Moon Maps: చంద్రయాన్-2 పెద్ద విజయం.. చంద్రుని ధ్రువ ప్రాంతాల హై-క్వాలిటీ డేటా విడుదల చేసిన ఇస్రో!

రేవంత్ రెడ్డి మరింత ఘాటుగా మాట్లాడుతూ “ఇది మొదటి సారి కాదు, ఇతర నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వచ్చినప్పుడు కూడా నేను మరింతగా ప్రచారం చేశాను” అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ, పార్టీ అభ్యర్థి విజయమే ప్రధాన లక్ష్యమని రేవంత్ వ్యాఖ్యానించారు. “ప్రజలతో నేరుగా కలవడం, వారి అభిప్రాయాలను వినడం ఇవే నా రాజకీయ శైలి. కేటీఆర్, కేసీఆర్ వంటి వారు లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ ప్రజలను దూరం నుంచి చూసే వారు కాదు నేను” అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో ఉపఎన్నిక ప్రచారం వేడిగా మారింది.

అదే సమయంలో రేవంత్ కేసీఆర్‌పై కూడా రేవంత్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. “జూబ్లీహిల్స్‌లో గెలుపుపై కేసీఆర్‌కు నమ్మకం ఉంటే, కనీసం సునీతను గెలిపించమని ఒక ప్రకటనైనా ఇచ్చేవారు,” అని కౌంటర్ వేశారు. “కానీ ఆయన మౌనం బీఆర్ఎస్‌లో ఉన్న గందరగోళాన్ని బయటపెడుతోంది. పార్టీ కార్యకర్తలకే ఇప్పుడు మార్గదర్శకత్వం లేకుండా పోయింది,” అన్నారు. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం నెలకొనగా, బీఆర్ఎస్ నేతలు ఆయన మాటలను రాజకీయ నాటకం అని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, ప్రతివిమర్శలతో తారస్థాయికి చేరుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • congress
  • Jublihils Bypoll
  • Jublihils Bypoll results
  • kavitha
  • kcr
  • ktr
  • Naveen Yadav
  • Sunitha

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

    Latest News

    • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

    • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

    • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

    • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd