Inquiry on Kaleshwaram Project : కాళేశ్వరం అవకతవకలపై కేసీఆర్ స్పందిస్తారా..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్
Kaleshwaram Project : ఒక వేళ కేసీఆర్ హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం మొదలైంది. కానీ కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము , ధైర్యం కాంగ్రెస్ సర్కార్ కు కానీ విచారణ కమిషన్ కు ఉందా..? అంటే సందేహమే అని చెప్పాలి
- Author : Sudheer
Date : 19-11-2024 - 8:56 IST
Published By : Hashtagu Telugu Desk
మరోసారి కాళేశ్వరం (Kaleshwaram Project) అవకతవకల అంశం తెరపైకి వచ్చింది. గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో వేలాది కోట్లు దోచుకుందని కాంగ్రెస్ , బిజెపి పార్టీల ఆరోపణలు ఈరోజువి కాదు..ప్రతిపక్ష హోదాలో ఉన్న దగ్గరి నుండి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇక కాంగ్రెస్ (Congress) పార్టీనే అధికారంలోకి రావడం తో కాళేశ్వరం విషయంలో ఏంజరిగిందో తేల్చాలంటూ ప్రత్యేక కమిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ (Justice Chandra Ghose Commission) విచారణను ఇప్పుడు మరోసారి స్పీడ్ అందుకుంటుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21న మరోసారి హైదరాబాద్‌కు రాబోతుంది. దాదాపు 15 రోజుల పాటు నగరంలోనే ఉండి..అప్పటి ఇరిగేషన్ మంత్రులను , ఆయా అధికారులను , ఆవరమైతే మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించాలని డిసైడ్ అయ్యింది. అయితే ఈ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. గతంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ కమిషన్ నోటీసులు ఇస్తే కేసీఆర్ విచారణకు హాజరుకాలేదు. అంతేకాదు జస్టిస్‌నరసింహారెడ్డి కమిషన్‌కు విచారణార్హత లేదంటూ లేఖ సైతం విడుదల చేసారు. దాంతో ఆ విచారణ అలాగే ఆగిపోయింది. ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేస్తే కేసీఆర్ వస్తాడా..? అనేది సస్పెన్స్.
ఒక వేళ కేసీఆర్ హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం మొదలైంది. కానీ కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము , ధైర్యం కాంగ్రెస్ సర్కార్ కు కానీ విచారణ కమిషన్ కు ఉందా..? అంటే సందేహమే అని చెప్పాలి. గత నెల రోజులుగా తెలంగాణ లో బాంబులు పేలుతున్నాయని, కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారని, బిఆర్ఎస్ పెద్ద తలకాయలు జైలు ఊచలు లెక్కబెట్టబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది తప్ప అరెస్టులు లేవు ఏమి లేవు. అలాంటిది మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా..? అంత ఉందా..? చూద్దాం ఏంజరుగుతుందో..!!
Read Also : Constipation : చలికాలంలో మలబద్ధకం… సింపుల్ సొల్యూషన్స్..!