HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Leaves For Nandinagar

Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

కేసీఆర్ తన నివాసం నుండి బయల్దేరిన సమయం నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. 'జై తెలంగాణ.. జై కేసీఆర్' నినాదాలతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి

  • Author : Sudheer Date : 01-02-2026 - 12:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Nandinagar
Kcr Nandinagar

Phone Tapping Case : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలంటూ సిట్ (SIT) జారీ చేసిన నోటీసుల మేరకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని నందినగర్‌కు బయల్దేరారు. కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారన్న వార్తతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులను తెరపైకి తెచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

భారీ జనసందోహం – నినాదాలతో హోరెత్తిన వీధులు

కేసీఆర్ తన నివాసం నుండి బయల్దేరిన సమయం నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. కేసీఆర్ కాన్వాయ్‌పై పూలు జల్లుతూ అభిమానులు తమ మద్దతును ప్రకటించారు. వందలాది మంది నాయకులు, కార్యకర్తలు దారి పొడవునా నిలబడి ఆయనకు సంఘీభావం తెలపడం విశేషం. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

నందినగర్‌లోని సిట్ కార్యాలయం వద్ద విచారణ నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నందినగర్ బస్ స్టాప్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, టీఎస్ స్టడీ సర్కిల్ మరియు ఎన్టీఆర్ భవన్ పరిసరాల్లో వాహనాల మళ్లింపు చేపట్టారు. విచారణ ఎంతసేపు కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేనందున, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపుల్లో భాగంగా జరుగుతున్న సిట్ విచారణకు హాజరు కావడానికి ఎర్రవెల్లి నివాసం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.

సిట్ విచారణకు హాజరు కావడానికి హైదరాబాద్ వస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి.. జై… pic.twitter.com/OoEslPOeZ2

— BRS Party (@BRSparty) February 1, 2026


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • kcr
  • nandinagar
  • Phone Tapping Case
  • SIT inquiry

Related News

Kcr Hc

సిట్ నోటీసులపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారా ?

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) జారీ చేసిన నోటీసుల అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు

  • Kcr Pm 3

    ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!

  • Sit Inquiry Kcr

    నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

  • Harish Rao Pm

    రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

  • Kcr

    Big Breaking News..కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు

Latest News

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

  • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

  • Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

  • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd