KCR : రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ భారీ కుట్ర – కాంగ్రెస్ ట్వీట్
KCR : తెలంగాణవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ పై దాడిని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తోందని ట్వీట్ లో పేర్కొంది
- By Sudheer Published Date - 01:31 PM, Thu - 14 November 24

తెలంగాణ (Telangana) లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుతుంది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న బిఆర్ఎస్..ఇప్పుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. కాంగ్రెస్ సైతం బిఆర్ఎస్ దాడికి ఎదురుదాడి చేస్తూ తగ్గేదేలే అని సమాధానం ఇస్తుంది. తాజాగా మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పై సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ (Congress Tweet) అధికారిక ట్విట్టర్ వేదికగా.. కేసీఆర్ తెలంగాణవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ పై దాడిని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తోందని ట్వీట్ లో పేర్కొంది. రైతులు, మహిళలు, నిరుద్యోగులంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు ముసుగువేసి దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించింది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని మండిపడింది.
ఇక వికారాబాద్ జిల్లా లగచర్ల లో స్మార్ట్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా గ్రామస్థులు , రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు గ్రామస్థులతో మాట్లాడేందుకు రాగా..వారిపై దాడి చేసారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అధికారులపై దాడి చేయడాన్ని పోలీసులు , ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన పరువుర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే ఇదే కేసులో ప్రభుత్వం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని సైతం అరెస్ట్ చేసింది. ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కేటీఆర్ పేరును సైతం ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలు ఉన్నాయని.. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అంటూ తీవ్రంగా స్పందించారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అంటూ నిలదీశారు. నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్.
అధికారుల పై దాడిని సమర్థిస్తున్న కేటీఆర్ & బీఆర్ఎస్ నాయకులు.
బీఆర్ఎస్ నాయకులకు రైతులు, మహిళలు, నిరుద్యోగులు అంటూ ముసుగు వేసి, ధర్నాలు నిర్వహించి, దాడులు చేసి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు విధ్వంసకర వ్యూహాలు. pic.twitter.com/gqTpGUWpff
— Telangana Congress (@INCTelangana) November 14, 2024
Read Also : AP Deputy Speaker : ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నిక