Telangana Talli Statue : పదేళ్లలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే కేసీఆర్ పెట్టలేదు – పొన్నం
telangana talli statue controversy : తెలంగాణ ఉద్యమంలో తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు ఉన్నాయని, అలాంటి విగ్రహం తెలంగాణ తల్లిగా గుర్తించడం సరి కాదన్నది కాంగ్రెస్ వాదన. అయితే కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన విగ్రం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును ప్రతిబింబించేలా ఉందని బిఆర్ఎస్ (BRS) ఆరోపణ
- By Sudheer Published Date - 04:02 PM, Mon - 9 December 24

తెలంగాణ (Telangana) లో విగ్రహాల (Statue) రాజకీయాలు కాకరేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congres Govt) తెలంగాణ తల్లి విగ్రహం(Telangana talli statue)లో మార్పులు చేసి ఈరోజు సచివాలయంలో ప్రతిష్టంచేందుకు ఏర్పాట్లు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఉద్యమంలో తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు ఉన్నాయని, అలాంటి విగ్రహం తెలంగాణ తల్లిగా గుర్తించడం సరి కాదన్నది కాంగ్రెస్ వాదన. అయితే కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన విగ్రం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును ప్రతిబింబించేలా ఉందని బిఆర్ఎస్ (BRS) ఆరోపణ..ఇలా రెండు పార్టీల మధ్య విగ్రహ మార్పు రగడ నడుస్తుంది.
ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు పదేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ..ఎప్పుడూ తెలంగాణ తల్లి విగ్రహం గురించి కనీస ఆలోచన చేయలేదు. అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే అధికారికంగా తెలంగాణ తల్లి రూపం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేస్తున్నారన్న వాదన కరెక్ట్ కాదని, అసలు తెలంగాణ తల్లికి ఇంత వరకూ అధికారికంగా ఒక రూపాన్ని ఇవ్వలేదని పొన్నం అన్నారు. బీఆర్ఎస్ భవన్ లో ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఉద్యమ సమయంలో తీర్చిదిద్దారు. ఆ విగ్రహాన్ని తెలంగాణ భవన్‌లో పెట్టారు. అయితే ఆ విగ్రహ నమూనాను అధికారికం చేయలేదు. దీంతోనే సమస్యలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలు చేయాలనుకున్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అధికారికంగా లేదు. తెలంగాణ పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ఏమిటని .. ప్రతిష్టించాలని అనుకున్నప్పుడు తెలంగాణ తల్లిరూపం ఎలా ఉండాలన్న చర్చ వచ్చింది. అప్పుడే రేవంత్ నిపుణులతో చర్చించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్దం చేశామని పొన్నం చెప్పుకొచ్చారు.
Read Also : Pushpa 2 : ‘పుష్ప-2’పై మాజీ మంత్రి రోజా ప్రశంసలు