Kavitha New Party: సద్దుల బతుకమ్మ సాక్షిగా కొత్త పార్టీపై కవిత ప్రకటన
Kavitha New Party: ఈ వేడుకల్లో అభిమానులతో మాట్లాడుతూ కవిత తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీ స్థాపించడానికైనా వెనుకాడమని సంకేతాలు ఇచ్చారు
- By Sudheer Published Date - 09:04 PM, Mon - 29 September 25

లండన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ శాసనమండలి సభ్యురాలు కవిత(kaviitha) ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ వాసులతో ఆమె కలసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు ప్రతి ఏడాది లండన్‌లో జరుగుతుంటాయి. ఈ వేడుకల్లో కవిత పాల్గొనడం ద్వారా తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి గౌరవం చాటినట్లయింది.
Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. సినిమాలపై 100 శాతం టారిఫ్!
ఈ వేడుకల్లో అభిమానులతో మాట్లాడుతూ కవిత తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీ స్థాపించడానికైనా వెనుకాడమని సంకేతాలు ఇచ్చారు. “నేను పార్టీ కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తాను” అని ఆమె స్పష్టం చేశారు. తమను BRS వద్దనుకున్నందున ఆ పార్టీ ఇచ్చిన పదవిని కూడా తనంతట తానే వదులుకున్నట్లు కవిత వివరించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే తీసుకున్న అడుగని అన్నారు.
మండలి ఛైర్మన్ ఇంకా తన రాజీనామాను ఆమోదించకపోవడం వెనుక కూడా కాంగ్రెస్ రాజకీయ ఉద్దేశం ఉండవచ్చని కవిత ఆరోపించారు. తెలంగాణ కోసం, అలాగే BRS కోసం రెండు దశాబ్దాలుగా తన జీవితాన్ని అంకితం చేశానని, ఈ క్రమంలో ఎన్నో బాధ్యతలు స్వీకరించానని గుర్తు చేశారు. “ప్రజల నమ్మకమే నాకు ముఖ్యమని, అదే దారిలో నేను ముందుకు సాగుతాను” అని ఆమె చెప్పడం ద్వారా తన రాజకీయ ప్రస్థానంపై స్పష్టతనిచ్చారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.