MLC For Kavitha: కవితకు ఎమ్మెల్సీ ఖరారు
అందరి ఊహాగానాలకు భిన్నంగా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కవితను ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించారు.
- Author : Hashtag U
Date : 23-11-2021 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
అందరి ఊహాగానాలకు భిన్నంగా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కవితను ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆమెను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా కేసీఆర్ కవితను MLC కోటాలో చేర్చడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
EARLIER SPECULATION
తెలంగాణ క్యాబినెట్ లో మంత్రి కావాలని కవిత ప్రయత్నం చేస్తోందని ఆమె సన్నిహితుల చెప్పుకుంటోన్న మాటలు. కానీ, మారుతోన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా క్యాబినెట్ లో స్థానం కల్పించడానికి కేసీఆర్ ధైర్యం చేయకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పటికే హరీశ్, కేటీఆర్ మంత్రులుగా ఉన్నారు. లేదు. ఈసారి యాదాద్రి ఆలయం ప్రారంభం తరువాత మంచి ముహుర్తం చూసుకుని కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారని ప్రగతిభవన్ వర్గాల సమాచారం. ఒక వేళ అదే జరిగితే, కవితకు మంత్రి పదవి కష్టమే.
Also Read : కేసీఆర్ నిర్ణయంపై సమంత, నాని, ప్రకాష్ రాజ్, రామ్ రియాక్షన్