HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Karnataka Cm Siddaramaiah Has No Right To Criticize Cm Kcr Mlc Kavitha

MLC Kavitha: సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదు : ఎమ్మెల్సీ కవిత

సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు.

  • Author : Balu J Date : 11-11-2023 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mlc Kavitha
Mlc Kavitha

MLC Kavitha: నిజామాబాద్ : తెలంగాణను దేశంలోని నంబర్ వన్ గా తీర్చిదిద్ది అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. కర్నాటకలోలా కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ ది అని, మెనిఫెస్టోలో చేర్చని హామీలను కూడా అమలు చేసి చూపించారని స్పష్టం చేశారు. గొప్ప రాష్ట్రమైన కర్నాటకలో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు వచ్చే ముందు ఇక్కడి స్థితిగతులన్నింటినీ తెలుసుకొని రావాలని సిద్దరామయ్యకు సూచించారు. అనేక పథకాలతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఉమ్మడి ఒక్క సీటును కూడా బీసీలకు కేటాయించని నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవిత గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీల భావోద్వేగాలను గౌరవిస్తూ అందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదరిస్తోందని తెలిపారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడం వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల అభివృద్ధలో దూసుకుపోతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇటివంటి సందర్భంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కర్నాటక సీఎం సిద్దరామయ్య కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారని విమర్శించారు. బీసీ డిక్లరేషన్ చాలా సత్యదూరంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయడం తప్పా వేరే మార్గమే లేదని విమర్శించారు. అప్పుడే తెలంగాణ మరింత ముందుకు సాగుతుందని అన్నారు.

జిల్లాకు చెందిన అనేక మంది కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి సేవలు అందించారని, అయినప్పటికీ జిల్లాకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 8 జనరల్ సీట్లలో కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లను బీసీలకు కేటాయించిందని గుర్తు చేశారు. మరీ ఈ ఎన్నికల్లో రేటెంత రెడ్డి గాంధీ భవన్ లో గాడ్సేలా దూరిన తర్వాత బాన్సువాడలో బీసీ నాయకుడు కాసుల బాల్ రాజు టికెట్ ను ధనవంతుడైన ఏనుగు రవీందర్ రెడ్డికి అమ్ముకున్నారని, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ టికెట్ ను బీసీలకు అవకాశం ఇవ్వకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారని వివరించారు. దాదాపు 10-15 మంది బీసీల నాయకుల రాజకీయ భవిష్యత్తుకు రేటు కట్టి వందలాది కోట్లకు టికెట్లను కాంగ్రెస్ అమ్ముకుందని తెలిపారు. రేటెంత రెడ్డి పోటీ చేస్తున్నారన్న కారణంతో కామారెడ్డి నుంచి మైనారిటీ అయిన షబ్బీర్ అలీని నిజామాబాద్ కు తరిమేశారని స్పష్టం చేశారు.

టికెట్ రాలేదన్న మనస్థాపంతో కాసుల బాల్ రాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని, కామారెడ్డి వరకు వచ్చిన రేవంత్ రెడ్డి కనీసం పరామర్శించలేని మానవీయకోణం లేకపొవడం దురదృష్టకరమన్నారు. బీసీల రాజకీయ జీవితాలకు సమాధి కడుతూ టికెట్లు అమ్ముకుంటున్న పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఎన్నికలకు ముందే టికెట్లను వందల కోట్లకు అమ్ముకున్న వ్యక్తి నడిపించే పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే మొత్తం తెలంగాణను గంపగుత్తగా అమ్ముతారు తప్పా ప్రజల గురించి కాంగ్రెస్ నాయకులు ఆలోచించబోరని అన్నారు. గతంలో కాంగ్రెస్ భయానక పాలనను ప్రజలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరారు.

ఇచ్చిన హామీలను అమలు చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే అక్కడి సీఎం సిద్దరామయ్య మన రాష్ట్రానికి వచ్చి బీసీలకు ఏం చేయాలో మన సీఎం కేసీఆర్ కు పాఠాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం దాదాపు రూ. 45 వేల కోట్లను ఖర్చు చేసిందని వివరించారు. ఇంత పెద్ద ఎత్తున బీసీ సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటామా లేదా రాజకీయంగా, విద్యాపరంగా, ఆత్మగౌరవం పరంగా అణగదొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటామా అన్నది ఆలోచించాల్సిన సందర్భం వచ్చిందన్నారు.

దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా లెక్కలు తీసే ధైర్యం లేని పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. 2004లో ఆర్ కృష్ణయ్యను తీసుకెళ్లి సీఎం కేసీఆర్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగణన చేపట్టాలని కోరినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని దౌర్భాగ్యమైన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • MLC Kavitha
  • nizamabad
  • siddaramaiah

Related News

A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

తెలంగాణకు చెందిన సంజన రెడ్డి, తన గ్రామంలోని రైతులకు సాధికారత కల్పించేందుకు అమెరికాలోని ఐటీ ఉద్యోగాన్ని తిరస్కరించారు. ఆమె తనకున్న పరిజ్ఞానాన్ని పసుపు సాగు, అమ్మకాలను మెరుగుపరచడానికి ఉపయోగించారు. రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే ‘ఇందూరు ఫార్మ్స్’ను రెడ్డి స్థాపించారు. ఈ సంస్థ రైతులకు మెరుగైన రాబడిని, కొనుగోలుదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది.

    Latest News

    • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

    • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

    • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

    • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

    • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd