HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kalyanamandapam Of Bhadradri Temple Leveled Due To Heavy Rains

Bhadrachalam Floods : భారీ వర్షాలకు భద్రాద్రి ఆలయ కల్యాణమండపం నేలమట్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండడం తో రామయ్య ఆలయం చుట్టూ వరద నీరు చేరింది

  • Author : Sudheer Date : 08-08-2024 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhadrachalam Ramaiah Temple
Bhadrachalam Ramaiah Temple

గత నాల్గు రోజులుగా ఖమ్మం. కొత్తగూడెం , మహబూబాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు , వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్థంభించింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండడం తో రామయ్య (Bhadrachalam Ramaiah Temple) ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. రామాలయం, అన్నదాన సత్రం పరిసరాల్లోకి వరద చేరింది. ఆలయ కొండపై ఉన్న కుసుమ హరినాథబాబా ఆలయ కల్యాణమండపం (Kalyana Mandapam of Harinath Baba Temple) కూలిపోయింది. మండపం కింద కొండను తవ్వడం వల్ల కూలిపోయిందని స్థానికులు అంటున్నారు. 1938లో హరినాధబాబా ఆలయం నిర్మించినట్లు చెపుతున్నారు. ఆలయ పరిసర ప్రాంతంలో సుమారు 35 దుకాణాలకు వరద చేరడంతో సామగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

భద్రాద్రి జిల్లా గరిమళ్లపాడులో అత్యధికంగా 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిన్నెరసాని, తాలిపేరు రిజర్వాయర్లలోకి వరద నీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. మహబూబాబాద్‌లోని ఉత్తరతాండ పంచాయతీ నేతాజీ తండా పాఠశాల గదులు జలమయమయ్యాయి. డోర్నకల్ శివారు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురంలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 29.9 అడుగులకు చేరుకుంది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. 24 గంటల్లో రాష్ట్రంలోని జోగులాంబ గద్వా ల, భదాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, ములుగు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Read Also : Bhagya Sri : పవన్ కళ్యాణ్ సార్ దేవుడు అనేసిన భాగ్య శ్రీ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhadrachalam
  • Bhadrachalam Ramaiah Temple
  • heavy rains

Related News

Revanth Reddy Bhadrachalam Temple

Cm Revanth Reddy: భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

Bhadrachalam Temple  భద్రాచలం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం. సీతారాములు కొలువైన భద్రాద్రి రాష్ట్ర విభజన నాటి నుంచి అభివృద్ధికి దూరమైంది. భౌగోళిక కారణాలతోపాటు రాజకీయ కారణాలు కూడా తోడు కావడంతో రాముడు ఎవరికీ పట్టనివాడయ్యాడు. కేసీఆర్ హయాంలో భద్రాచలం పురోగతి ఆగిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల చొరవతో సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంప

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

Latest News

  • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

  • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

  • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd