Bhagya Sri : పవన్ కళ్యాణ్ సార్ దేవుడు అనేసిన భాగ్య శ్రీ..!
పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో చూపించగా దానికి రిప్లై ఇచ్చిన భాగ్య శ్రీ PK సార్ ఈజ్ గాడ్ అనేసింది. అంటే పవన్ కళ్యాణ్ దేవుడు అని అన్నది.
- By Ramesh Published Date - 10:43 AM, Thu - 8 August 24

Bhagya Sri హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ లీడ్ రోల్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది భాగ్య శ్రీ బోర్స్. సినిమా రిలీజ్ కు ముందు ఈ రేంజ్ లో హంగామా చేస్తుంది అంటే అది భాగ్య శ్రీ గ్లామర్ వల్లే అని చెప్పొచ్చు. కచ్చితంగా అమ్మడికి టాలీవుడ్ లో మంచి పాపులారిటీ వచ్చేలా ఉంది. ఐతే తెలుగులో రాణించాలంటే గ్లామర్ తో పాటు గ్రామర్ అదే ఇక్కడ ఆడియన్స్ మైండ్ సెట్ కూడా అర్ధం చేసుకోవాలని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది అమ్మడు.
రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అమ్మడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది. తను మాట్లాడుతున్న టైం లో ఆడియన్స్ లో కొందరు రవితేజ (Raviteja), పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో చూపించగా దానికి రిప్లై ఇచ్చిన భాగ్య శ్రీ PK సార్ ఈజ్ గాడ్ అనేసింది. అంటే పవన్ కళ్యాణ్ దేవుడు అని అన్నది.
ALso Read : Naga Chaitanya : ఆ హీరోయిన్ తో నాగ చైతన్య ఎంగేజ్మెంట్..?
డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ (Power Star)కు వీరాభిమాని అని తెలిసిందే. ఆయన దారిలోనే భాగ్య శ్రీ కూడా పవన్ కళ్యాణ్ ని ఆరాధిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ గురించి అడగ్గానే అతను దేవుడు అని చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది. ఈమధ్య పవన్ గురించి ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడినా సరే వార్తల్లో హైలెట్ అవుతున్నారు.
ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ ప్రచార చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న భాగ్య శ్రీ పవర్ స్టార్ పై తన అభిమానం చూపించి మరింత క్రేజ్ తెచ్చుకుంది. పి.కే సార్ గాడ్ అనేసిన భాగ్య శ్రీ ఆయనతో నటించే ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి.