Kalvakuntla Kavitha: రాహుల్ గాంధీకి కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
- By Balu J Published Date - 01:35 PM, Wed - 12 July 23

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తనదైన స్టయిల్ లో రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నెర్ర చేశారు. తెలంగాణ రైతాంగం పై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు.
ఈ మేరకు కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ట్వీట్ చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తే కాంగ్రెస్ కి వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. “రాహుల్ గాంధీ గారు…. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందులపాలు చేయాలనుకుంటున్నారా ??” అని అడిగారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామని కవిత స్పష్టం చేశారు.
Also Read: Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పై చెలరేగుతాడా