Kaleshwaram Motors : అట్లుంటది మనతోని – కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు
Kaleshwaram Motors : కాళేశ్వరం నిరుపయోగమంటూ దుష్ప్రచారం చేసినవాళ్లే ఇప్పుడు మళ్లీ వాటిని వాడుతున్నారు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు
- By Sudheer Published Date - 07:28 PM, Tue - 8 July 25

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సమర్థించారు. ఇది BRS ప్రభుత్వ సాధనకే ఫలితం అని, అప్పట్లో చేసిన ప్రణాళికల వల్లే ఈరోజు నెరవేరిందని హరీష్ రావు పేర్కొన్నారు. “మేము పెట్టిన ప్రాజెక్టులే ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాయి. కాళేశ్వరం నిరుపయోగమంటూ దుష్ప్రచారం చేసినవాళ్లే ఇప్పుడు మళ్లీ వాటిని వాడుతున్నారు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. “ప్రభుత్వాన్ని నిలదీస్తే గానీ ప్రభుత్వంలో కదలిక రాదా? రైతుల సమస్యలు గుర్తు రావు” అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ఎత్తిచూపుతూ “రైతుల నోరు, కడుపు కొడుతున్నాడు అంటే గానీ ఆలోచన రాదా?” అని తీవ్రంగా మండిపడ్డారు. BRS హయాంలో రైతులకు అందించిన మౌలిక సదుపాయాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
Bharat Bandh: స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉందా? భారత్ బంద్ ప్రభావం చూపనుందా?
అంతకు ముందు హరీష్ రావు..కాళేశ్వరం మోటార్లను మళ్లీ ఆన్ చేయాలని, పొలాలకు నీళ్లు మళ్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రైతాంగానికి మద్దతుగా వ్యవహరించాల్సింది పోయి ప్రతీకారపూరితంగా వ్యవహరిస్తే నష్టమంతా రాష్ట్రానికే వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా పక్షపాతపు నిర్ణయాలను మానుకొని రైతుల అభ్యున్నతిపై దృష్టిసారించాలన్నారు. అలాగే ఉపాధి హమీ ఏపీఓలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హమీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.