HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Joining The Brs Party From Maharashtra

Harish Rao: మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు!

  • Author : Hashtag U Date : 23-06-2023 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1
1

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో పలువురు మహారాష్ట్రకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు. జనతాపార్టీ లాతూర్ జిల్లా అధ్యక్షుడు జయసింగ్ యాదవ్ బిఆర్ఎస్ లో చేరారు. వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. వీరితో పాటు లాతూర్ జిల్లా సంఘటన కు చెందిన వోన్రాజ్ రాథోడ్, కాంగ్రేస్ పార్టీ నుంచి అర్జున్ రాథోడ్, భగవంత్ కులకర్ణి తదితరులు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి మంత్రి హరీశ్ రావు పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న సాగునీరు తాగునీరు ఉచిత విద్యుత్ వంటి పథకాలు, రైతు వ్యవసాయం పేదల సంక్షేమం కోసం చేపట్టిన కార్యాచరణ నేడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిందని అన్నారు. మహారాష్ట్రలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ మోడల్ పాలన మహారాష్ట్రలో కూడా అమలవుతుందని స్పష్టం చేశారు. దేశంలో కిసాన్ సర్కార్ స్థాపనకోసం బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, జయంత్ దేశ్ ముఖ్ తదితరులున్నారు.

కాగా….నిన్న జరిగిన దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల్లో తామూ కూడా పాల్గొన్నామని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ నాడు చేసిన పోరాటం ఎంతో గొప్పగా వున్నదనే విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని మహారాష్ట్ర నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత స్వయం పాలనలో కూడా అదే ఉద్యమ స్పూర్థిని కొనసాగిస్తూ పాలన చేయడం వలనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని వారన్నారు. రైతులు పేదలు బడుగు బలహీన వర్గాలకోసం పోరాడేతత్వమున్న సిఎం కేసీఆర్ , మహారాష్ట్ర అభ్యున్నతి కోసం దేశ రైతాంగం కోసం కూడా పోరాడుతారనే విశ్వాసం తమకున్నదని వారు తమ మనసులో మాటను స్పష్టం చేశారు.

Also Read: BCCI: వెస్టిండీస్ తో తలపడే భారత జట్టు ఇదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • harish rao
  • hyderabad
  • telangana

Related News

Harish Rao

రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

తెలంగాణ లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ , అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడినప్పటికీ, ప్రజలు బిఆర్ఎస్ కు ఘన విజయం అందించారని తెలిపారు.

  • KTR Challenges Revanth Reddy to Resign with 10 MLAs

    నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

  • Christmas Holidays 2025 Sch

    విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

  • Maoists Khali

    తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

Latest News

  • వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

  • దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • ఏపీ టెట్ ‘కీ’ విడుదల

  • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

  • మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd