Jalagam Venkat Rao : BRSకు ఆ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నాడా?
కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు(Jalagam Venkat Rao) తాజాగా దమ్మపేట మండలం, పట్వారిగూడెం గ్రామంలో పామ్ ఆయిల్ తోటలోఒక ప్రైవేట్ ఫంక్షన్ కార్యక్రమంలో అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పరిచారు.
- By News Desk Published Date - 07:30 PM, Sun - 21 May 23

ఎలక్షన్స్(Elections) దగ్గరపడుతుండటంతో రాజకీయ నాయకులు పార్టీలు మారుతూనే ఉంటారు. టికెట్ కోసం చూసి రాకపోతే, పార్టీ అధిష్టానం నుంచి సపోర్ట్ లేకపోయినా కొంతమంది పార్టీ మారడానికి మొగ్గు చూపుతారు. ఇప్పుrt ఓ BRS మాజీ ఎమ్మెల్యే(MLA) ఆ పార్టీకి షాక్ ఇస్తాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు(Jalagam Venkat Rao) తాజాగా దమ్మపేట మండలం, పట్వారిగూడెం గ్రామంలో పామ్ ఆయిల్ తోటలోఒక ప్రైవేట్ ఫంక్షన్ కార్యక్రమంలో అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పరిచారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు లేకుండానే అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నారు జలగం వెంకట్రావు. కొత్తగూడెం టికెట్ సిపిఐ,బిఆర్ఎస్ పొత్తులో భాగంగా సిపిఐకి వెళ్తుందని ప్రచారం జరుగుతున్న నేపద్యంలోనే అనుచరులతో సమావేశమయ్యాడని సమాచారం.
జలగం వెంకట్రావుతో ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి నేతలు సైతం మాట్లాడుతున్నట్లు సమాచారం. నేడు తన అనుచరులతో సడెన్ గా ఇలా మీటింగ్ పెట్టడంతో జలగం వెంకట్రావ్ BRS కు షాక్ ఇస్తాడా అని అనుకుంటున్నారు. జలగం వెంకట్రావ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2004లో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత TRSలో చేరి 2014లో కొత్తగూడెం నుంచి ఎన్నికయ్యారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఈ సమావేశంతో జలగం వెంకట్రావ్ పార్టీ మారతారని వినిపిస్తుంది.
Also Read : YS Sharmila: షర్మిలపై’ DK’ ఆపరేషన్! త్వరలో ప్రియాంకతో భేటీ?