Congress CM Candidate : టీ కాంగ్రెస్ లో సీఎం ఎవరు..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్
ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రిని ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్‌లో లేదని స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 07:08 PM, Mon - 27 November 23

మరో రెండు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ (Telangana Election Polling) జరగనుంది. నెల రోజులుగా అన్ని పార్టీలు అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా కష్టపడ్డాయి. ఎవరికీ వారు హామీల వర్షం కురిపించారు. మరి ప్రజలు ఎవరికీ పట్టం కట్టబోతారనేది తెలిసే సమయం వచ్చింది. అయితే ఈసారి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారని అనేక సర్వేలు చెపుతూ వచ్చాయి. అధికార పార్టీ సైతం కాస్త అలర్ట్ అయ్యింది. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS) మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలనీ చూస్తుంది. అయితే బిఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ (KCR) , బిజెపి నుండి బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించింది. మరి కాంగ్రెస్ అభ్యర్థి (Congress CM Candidate) ఎవరు అనేది అధికార పార్టీ నేతలతో పాటు..యావత్ ఓటర్లు అడుగుతున్న ప్రశ్న. దీనికి తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) క్లారిటీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రిని ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్‌లో లేదని స్పష్టం చేశారు. ఫలితాల తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే సీఎం అభ్యర్థిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జైరాం రమేష్.. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని రైతులు, యువకులు, మహిళలను నమ్మక ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తే ప్రస్తుతం దాని లోపలే ఐటీ కంపెనీలు వచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ వస్తుందని ధీమ వ్యక్తం చేశారు.
Read Also : Harom Hara Teaser : ప్రభాస్ చేతుల మీదుగా సుధీర్ బాబు ‘హరోం హర’ టీజర్ విడుదల