Jaggareddy : చిరంజీవి..రాహుల్ కు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని జగ్గారెడ్డి సూటి ప్రశ్న
మోదీకి, పవన్ కు మాత్రమే ఎందుకు మద్దతిస్తున్నారని... రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నించారు
- By Sudheer Published Date - 06:08 PM, Fri - 19 July 24

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy)..తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫై కీలక వ్యాఖ్యలు చేసి మెగా అభిమానుల్లో ఆగ్రహం నింపారు. రైతుల సమస్యలపై ఖైదీ నం150 అనే సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో ధర్నాలు చేసిన రైతులకు, రైతుల తరుపున పోరాటం చేసిన ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు.
సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న చిరంజీవి.. రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని, రైతులను ఇబ్బంది పెట్టిన..పెడుతున్న ప్రధాని మోదీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. మోదీకి, పవన్ కు మాత్రమే ఎందుకు మద్దతిస్తున్నారని… రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే చిరంజీవి సక్రమ మార్గంలో ఉండేవారని… ఇప్పుడు పక్కదారి పట్టారని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సమాజం కోసం ఎంతో చేసారని , చేస్తూనే ఉన్నారని..మొన్నటికి మొన్న డ్రగ్స్ విషయంలో స్వయంగా వీడియో చేసి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసారని..అలాంటి చిరంజీవి ని విమర్శించడం జగ్గారెడ్డి కి తగదని..హెచ్చరిస్తున్నారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ https://t.co/Q74YvLszRA
— Telangana Congress (@INCTelangana) July 19, 2024
Read Also : CM Revanth Reddy : మహాంకాళీ బోనాల జాతర..సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం