CLP Meet: సీఎల్పీ సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయిన జగ్గారెడ్డి, సీతక్క
- By Siddartha Kallepelly Published Date - 09:07 AM, Mon - 7 March 22

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా జరిగిన సీఎల్పీ భేటీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాయికాట్ చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు.
తనకు ఎదురైన చేదు అనుభవాలను సమావేశంలో ప్రస్తావించేందుకు సీఎల్పీ భేటీకి హాజరయ్యానని, అయితే పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కుసుమకుమార్ సూచించారని అందుకే భేటీ నుంచి వెళ్లిపోతున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు.గత కొన్ని రోజులుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ పై పలు విమర్శలు చేస్తోన్న జగ్గారెడ్డి మరోసారి ఫైరయ్యారు.
రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని, ఆయన మెదక్ జిల్లా పర్యటన గురించి తనకి తెలియదని జగ్గారెడ్డి తెలిపారు. తనకి ఎదురైన చేదు అనుభవాల గురించి సీఎల్పీ మీటింగ్లో ప్రస్తావించాలని వచ్చానని, కానీ ప్రజా సమస్యలు చర్చించేందుకు ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో పార్టీ అంశాలను ప్రస్తావిస్తే ఎజెండా చెడిపోతుందని పలువురు సూచించారని జగ్గారెడ్డి తెలిపారు. తనకి ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పేందుకు అవకాశం లేనప్పుడు సీఎల్పీ సమావేశంలో ఉండడమెందుకని వెళ్లిపోతున్నానని, అయితే అంసెంబ్లీకి వెళ్లటం ఎమ్మెల్యేగా తన హక్కని, అసెంబ్లీకి వెళ్లి కేసీఆర్తో కొట్లాడతానని ఆయన ప్రకటించారు.
పార్టీ సభ్యులు విబేధాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సీఎల్పీ సమావేశానికి హాజరైణ ఆమె పలు అంశాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు నివేదికను అందజేసినట్లు తెలిపారు. అయితే తనకు ఇతర పార్టీ కార్యక్రమాలు ఉండడంతో సమావేశం మధ్యలోనే వెళ్తున్నట్లు తెలిపారు.