IT attacks : శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ రైడ్స్
నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ఈ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో పలువురు తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేశారు.
- By Latha Suma Published Date - 05:31 PM, Mon - 10 March 25

IT attacks : హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను అవకతవకలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రిసీట్ ఇవ్వకుండా స్టూడెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేసి పెద్దఎత్తున ట్యాక్స్ ఎగ్గొటినట్లు గుర్తించిన అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. హైదరాబాద్ లోని మాధాపూర్ శ్రీచైతన్య కాలేజీ హెడ్ క్వార్టర్‌లో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద ఎత్తున అక్రమ లావేదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.
Read Also: State Funds : సందర్భం వస్తే ఢిల్లీలో ధర్నా చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తమ నుండి అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. కాగా, నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ఈ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో పలువురు తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేశారు. ఫీజుల విషయంలోనూ ఫిర్యాదుల రావడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏకకాలంలో దేశంలోని పలు నగరాలలో ఉన్న ఈ కాలేజీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కాలేజీలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తేలింది.
మరి సోదాల్లో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. కళాశాలల యజమాన్యాలు వెల్లడించిన వివరాలు, సోదాల్లో లభించిన వివరాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. కంప్యూటర్స్ హార్డ్ డిస్క్, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో తెల్లవారుజామున ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి..రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ల నివాసాలు, హైదరాబాద్ లో ఉన్న ప్రధాన కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.
Read Also: TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల