HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >It Raids On Brs Mlc Kavitha House

ED Raids : బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు

ED Raids : రేపు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

  • Author : Pasha Date : 15-03-2024 - 3:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha Cm Revanth
Kavitha Cm Revanth

ED Raids : రేపు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ రైడ్స్ నిర్వహిస్తోంది. ఈడీ అధికారులతో(ED Raids) కలిసి ఐటీ ఆఫీసర్లు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అధికారులు నాలుగు టీమ్‌లుగా ఏర్పడి ఈ తనిఖీలు చేస్తున్నారని తెలుస్తోంది. ఐటీ దాడుల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.

We’re now on WhatsApp. Click to Join

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ జారీ చేరిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం విచారణ చేపట్టింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గతేడాది కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని కవిత ఆరోపించారు. అప్పట్లో కవిత పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో సుప్రీంకోర్టు ధర్మాసనం జత చేసింది. అయితే పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు ఇటీవల గత విచారణలో జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. మూడు కేసులు వేర్వేరు అని, కలిపి విచారణ చేయడం సబబు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.వాస్తవానికి కవిత పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కవిత వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. లిక్కర్ స్కాం కేసులో గతంలో కవితకు రెండు సార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఢిల్లీలో ఆమెను అధికారులు మూడు రోజులు విచారించారు. జనవరి 16న విచారణకు రావాలని కవితను ఈడీ కోరగా..సుప్రీంకోర్టులో కేసు పెండింగ్​లో ఉన్నందున హాజరుకాలేనని ఆమె లేఖ రాశారు.

Also Read :BRS – BSP : బీఎస్పీకి ఆ 2 లోక్‌సభ సీట్లు.. బీఆర్ఎస్​ కీలక నిర్ణయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Delhi Liquor scam
  • Ed Raids
  • IT raids
  • kcr
  • ktr
  • MLC Kavitha
  • Supreme Court

Related News

Harish Rao Kmm

Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడిందని, అభివృద్ధి కంటే అవినీతికే పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇప్పటికే మార్పును కోరుకుంటున్నారని హరీష్ రావు తన ప్రసంగంలో స్పష్టం

    Latest News

    • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

    • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

    • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

    Trending News

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

      • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd