Congress Govt : ఇళ్లులు కూల్చడం పై ఉన్న శ్రద్ద నిర్మాణాల మీద లేదా..? – కేటీఆర్
Congress Govt : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో అభివృద్ధికి పక్కనబడి కేవలం పూర్తి అయిన ప్రాజెక్టులకే రిబ్బన్ కట్టడం లాంటి పనులు చేశారని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు
- By Sudheer Published Date - 11:00 AM, Thu - 10 April 25

హైదరాబాద్‌లో చేపట్టిన ఎస్‌ఆర్డీపీ (SRDP) ప్రాజెక్టుల పనులు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)లో నత్తనడకన సాగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో అభివృద్ధికి పక్కనబడి కేవలం పూర్తి అయిన ప్రాజెక్టులకే రిబ్బన్ కట్టడం లాంటి పనులు చేశారని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పలు కీలక ప్రాజెక్టుల పురోగతి పూర్తిగా ఆగిపోయిందని, వాటిపై సమీక్ష లేకుండా గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Visakhapatnam GVMC: విదేశాలకు మారుతున్న విశాఖ జీవీఎంసీ రాజకీయం!
ఫలక్‌నుమా ఆర్వోబీ, శిల్పా లేఅవుట్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే రెండో లెవెల్ వంతెన, శాస్త్రిపురం ఆర్వోబీ వంటి నిర్మాణాలు నిలిచిపోయినప్పటికీ వాటిపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టే చురుకుతనాన్ని, అభివృద్ధి పనులపై చూపకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల కోసం చేపట్టిన పనులను పూర్తి చేయడంలో ఆసక్తి లేకపోవడం ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు.
Trump Tariffs: సుంకాలపై ట్రంప్ కీలక ప్రకటన.. చైనాపై 125 శాతం టారిఫ్!
పేదల ఇండ్ల కూల్చివేతల విషయంలో చూపుతున్న ఉత్సాహాన్ని, అభివృద్ధి పనులపై చూపాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైడ్రా, మూసీ నదుల పునరుద్ధరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం తప్ప, కొత్త నిర్మాణాలపై ప్రభుత్వం ఎటువంటి శ్రద్ధ చూపడం లేదన్నారు. అభివృద్ధి అనేది భూములను బలవంతంగా తీసుకోవడం, బుల్డోజర్లతో ప్రజల ఇళ్లపై దాడి చేయడం కాదని, నిజమైన అభివృద్ధి ప్రజలకు మేలు చేసే పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేయడమేనని కేటీఆర్ తన ట్వీట్ల ద్వారా వ్యాఖ్యానించారు.
నాడు వాయువేగంతో ఎస్ఆర్డీపీ పథకం కింద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జీలు
16 నెలల కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్న పనులు
ఫలక్ నుమా ఆర్వోబీని పట్టించుకునే పరిస్థితి లేదు
ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి చంచల్ గూడా జైలుకు పంపే శ్రద్ద దాని ముందున్న ఫ్లై ఓవర్ పూర్తి చేయడంపై… pic.twitter.com/jSpkpY6ob4
— KTR (@KTRBRS) April 10, 2025